ASBL NSL Infratech

పుష్ప‌2 కోసం వాళ్ల‌ను బ్లాక్ చేసిన మైత్రీ నిర్మాత‌లు

పుష్ప‌2 కోసం వాళ్ల‌ను బ్లాక్ చేసిన మైత్రీ నిర్మాత‌లు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేష‌న్ లో వ‌స్తున్న సినిమా పుష్ప‌2. ఈ సినిమా కోసం యావ‌త్ భార‌త‌దేశం ఎంతగానో ఎదురుచూస్తుంది. దాదాపు షూటింగ్ చివ‌రిద‌శ‌కు చేరుకున్న ఈ సినిమా ఆగ‌స్ట్ 15న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో పెండింగ్ వ‌ర్క్స్ ను మేక‌ర్స్ ఎంతో వేగంగా పూర్తిచేస్తున్నారు.

దానికోసం జూన్ నుంచే ఫ‌హ‌ద్ ఫాసిల్ డేట్స్ ఇచ్చాడు. ఫ‌హ‌ద్ తో పాటూ బ‌న్నీ ఇత‌ర కీల‌క నేత‌ల‌పై ముఖ్య సీన్స్ షూట్ చేయ‌నున్నారు. బ‌న్నీ, ఫ‌హ‌ద్ డేట్స్ కు ఎలాంటి ఇబ్బందులు లేవు కానీ మిగిలిన కీల‌క నేత‌లైన అన‌సూయ‌, సునీల్, రావు ర‌మేష్ తో కూడా ప‌లు సీన్స్ ను షూట్ చేయాల్సి ఉంద‌ట‌. వీరు పుష్ప‌2 తో పాటూ వేరే సినిమాల‌కు కూడా డేట్స్ ఇచ్చి ఉన్నారు.

పుష్ప‌తో పాటూ మిగిలిన సినిమాల‌ను కూడా ఈ ముగ్గురూ పూర్తి చేయాల్సి ఉంది. దీంతో మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ ముగ్గుర్ని బ్లాక్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ రెండు నెల‌ల పాటూ పూర్తిగా త‌మ‌కే అందుబాటులో ఉండాల‌ని సూచించింద‌ట‌. షూటింగ్ కోసం ఓ నెల‌, ఆ త‌ర్వాత ప్ర‌మోష‌న్స్ కోసం మ‌రో నెల రోజులు కేటాయించాల‌ని చెప్పార‌ట‌. దానికి న‌టులు కూడా అంగీక‌రించిన‌ట్లు తెలుస్తోంది. మ‌రి దీనికి మైత్రీ నిర్మాత‌లు స‌ద‌రు న‌టుల‌కు అద‌నంగా రెమ్యూన‌రేష‌న్ ఇస్తున్నారా లేక వాళ్లే త‌మ డేట్స్ ను అడ్జ‌స్ట్ చేసుకుని చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :