Radha Spaces ASBL

‘ఆయ్’ వంటి నెటివిటీ ఫన్ ఎంటర్‌టైనర్‌కి వర్క్ చేయటం కొత్త ఎక్స్‌పీరియెన్స్‌నిచ్చింది... మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాల

‘ఆయ్’ వంటి నెటివిటీ ఫన్ ఎంటర్‌టైనర్‌కి వర్క్ చేయటం కొత్త ఎక్స్‌పీరియెన్స్‌నిచ్చింది... మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాల

రామ్ మిర్యాల...ఆయన పాట వింటుంటే మన స్నేహితుడే పాడుతున్నట్లుంటుంది. మన మట్టి వాసనను గుర్తుకు తెచ్చేలా, మన భావోద్వేగాలను స్పృశించేలా పాట పాడటం ఆయన నైజం. ఓ వైపు సింగర్‌గా, మరో వైపు మ్యూజిక్ డైరెక్టర్ తనదైన గుర్తింపు తెచ్చుకుని ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆయన అచ్చ తెలుగు వినోదాల విందుల ‘ఆయ్’ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.

ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలను అందించిన ప్రతిష్టాత్మక సంస్థ GA2 పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న నెటివిటీ ఫన్ ఎంటర్‌టైనర్ ‘ఆయ్’. ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటిస్తున్నారు. అంజి కె.మణిపుత్ర ఈ చిత్రంతో దర్శకుడిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. టాలెంటెడ్ యంగ్ ప్రొడ్యూసర్స్ బన్నీ, విద్యా కొప్పినీడి ఈ ఫన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు.ఈ వేసవిలో సినిమా సందడి చేయటానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాలతో ప్రత్యేకమైన చిట్ చాట్...

* ‘ఆయ్’ సినిమా కోసం నన్ను బన్నీవాస్‌గారు పిలిచారు. నా స్టైల్ ఆఫ్ మ్యూజిక్ ఒకలా ఉంటుంది. ఆయనేమో నెటివిటీ ఫన్ ఎంటర్‌టైనర్ మూవీ చేస్తామని అన్నారుగా.. నాకేం సెట్ అవుతుందిలే నో చెప్పేద్దామని అనుకున్నాను. కానీ అక్కడకు వెళ్లి కథ విన్నాక.. చాలా బాగా నచ్చేసింది. గోదావరి బ్యాక్ డ్రాప్‌లో సాగే సినిమా. సినిమాలో ఆసాంతం కామెడీతో పాటు చక్కటి లవ్ స్టోరీ కూడా ఉంటుంది. అన్నీ వర్గాల ప్రేక్షకులకు నచ్చే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ ఇది.

* సినిమాలో రెండు పాటలు చేశాను. రీసెంట్‌గా ‘సూఫియానా..’ అనే మెలోడి సాంగ్ రిలీజైంది. పాటకు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. రేపు థియేటర్స్‌లో సినిమా వచ్చిన తర్వాత సాంగ్ నెక్ట్స్ రేంజ్ లో కనెక్ట్ అవుతుందనే నమ్మకం ఉంది. మరో పాట పెళ్లి నేపథ్యంలో ఉంటుంది. అది కూడా త్వరలోనే రిలీజ్ అవుతుంది.

* సాధారణంగా మ్యూజిక్ డైరెక్టర్‌కి, చిత్ర దర్శకుడితో మంచి బంధం ఉండాలి. అప్పుడే మంచి సంగీతం కుదురుతుంది. ఇది చాలా సందర్భాల్లో నిజమైయ్యాయి. ఇక ఆయ్ సినిమాలో  ‘సూఫియానా..’ సాంగ్ ఇంత చక్కగా రావటానికి కారణం.. డైరెక్టర్ అంజి కె.మణిపుత్ర. ఆయన నాకు సిట్యువేషన్స్ వివరించిన తీరుతో మంచి పాటలను అందించగలిగాను.

* ఓ సింగర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా అన్నీ రకాల పాటలను చేయాలనేది నా కోరిక. కొన్ని సందర్భాల్లో చేయగలమా లేమా అని అనుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇంతకు ముందు చెప్పినట్లు దర్శకుడితో ఉన్న బాండింగ్ కూడా మనలో కొత్త ఔట్ పుట్‌ను తీసుకొస్తుంది. ఆయ్ సినిమాకు సంబంధించి నా విషయంలో జరిగిందదే. ఎందుకంటే ఇప్పటి వరకు ఇలాంటి జోనర్ లో నేను సినిమా చేయలేదు. నాకు కొత్త ఎక్స్‌పీరియెన్స్‌నిచ్చింది. తప్పకుండా పాటలు మెప్పిస్తాయి.

* ఓ టెక్నీషియన్ గా ప్రతీరోజు నేర్చుకుంటూనే ఉండాలి. సింగర్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా కొత్త సౌండింగ్ ను ప్రేక్షకుడికి అందించాలనే తాపత్రయంతో పని చేయాలి. అప్పుడే ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. ఈ జర్నీలో మనం పని చేసే దర్శకుల సహకారం కూడా ఎంతో అవసరం. ఇప్పటి వరకు నేను పని చేసిన మ్యూజిక్ డైరెక్టర్స్, డైరెక్టర్స్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. వారందరికీ థాంక్స్.

* ప్రస్తుతం ‘ఆయ్’ సినిమాకు వర్క్ చేస్తున్నాను. సినిమా వేసవిలో విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే ‘టిల్లు స్క్వేర్’ మూవీ మార్చి 29న రిలీజ్ అవుతుంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :