ASBL Koncept Ambience
facebook whatsapp X

స్పిరిట్ కు ముహూర్తం ఫిక్స్?

స్పిరిట్ కు ముహూర్తం ఫిక్స్?

యానిమ‌ల్ సినిమా వ‌చ్చిన ద‌గ్గ‌ర నుంచి సందీప్ రెడ్డి వంగా సైలైంట్ గా ఉంటున్న సంగ‌తి తెలిసిందే. డార్లింగ్ తో తీయాల్సిన స్పిరిట్ గురించి అడిగితే ఆ ప‌నుల్లోనే బిజీగా ఉన్నానంటున్నాడు కానీ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంద‌నేది మాత్రం చెప్ప‌డం లేదు. ప్ర‌భాస్ వేరే సినిమాల‌తో బిజీగా ఉండ‌టం వ‌ల్లే ఇంకా డేట్స్ ఇవ్వ‌డం లేద‌ని అందరూ సైలెంట్ అయ్యారు.

మే లో క‌ల్కి రిలీజ్ అయితే ప్ర‌భాస్ ఫ్రీ అయిపోతాడు. ఆ త‌ర్వాత సలార్2 స్టార్ట్ అవుతుంది. ఈ సినిమాను 15 నెల‌ల్లో ఫినిష్ చేయాల‌ని టార్గెట్ గా పెట్టుకున్నారు మేక‌ర్స్. దీంతో పాటూ రాజా సాబ్ షూటింగ్ లో కూడా ప్రభాస్ స‌మాంతరంగా పాల్గొంటాడు. స‌లార్2 2025 మిడ్ లో రిలీజ్ అయ్యే ఛాన్సుంది. ఈ లోపు రాజా సాబ్ రిలీజ‌వుతుంది.

వీటి మ‌ధ్య‌లో స్పిరిట్ సినిమా ఎప్పుడు మొద‌ల‌వుతుందంటే డిసెంబర్ లో ఈ సినిమార‌కు ముహూర్తం పెట్టిన‌ట్లు తెలుస్తోంది. డిసెంబ‌ర్ ఫ‌స్ట వీక్ లో ఈ సినిమాను స్టార్ట్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఆ త‌ర్వాత 2025లో రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ చేయాల‌ని సందీప్ చూస్తున్నాడ‌ట‌. అప్ప‌టికి స‌లార్-2 మేజ‌ర్ షూటింగ్ అయిపోతుంది కాబ‌ట్టి ప్ర‌భాస్ ఫ్రీ అవుతాడు. ఆ త‌ర్వాత నుంచి స్పిరిట్ షూట్ లో జాయిన్ అవ‌డానికి ప్ర‌భాస్ కు ఎలాంటి ప్రాబ్ల‌మ్ ఉండ‌దు. 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :