Radha Spaces ASBL

బాలీవుడ్ మృణాల్ ను అవ‌మానించిందా?

బాలీవుడ్ మృణాల్ ను అవ‌మానించిందా?

సీతారామం మూవీలో సీత పాత్ర‌తో అంద‌రూ గుర్తుండిపోయింది మృణాల్ ఠాకూర్. ఈ మ‌ధ్య కాలంలో ఓ హీరోయిన్ ను ఎవ‌రూ ఇంతలా గుర్తు పెట్టుకున్న‌ది లేదు. సీత పాత్ర‌లో మృణాల్ చేసిన న‌ట‌న అలాంటిది. దానికి తోడు ఆ పాత్ర కూడా చాలా బాగుంటుంది. మృణాల్ చేసిన సీత క్యారెక్ట‌ర్ కు ఆడియ‌న్స్ ఎంత‌గానో కనెక్ట్ అయ్యారు.

అందుకే బాలీవుడ్ లో మృణాల్ గ్లామ‌ర్ పాత్ర‌లు చేసినా మ‌న వాళ్లు ఆ పాత్ర‌ల‌ను చూడ‌లేక‌పోతున్నారు. దీంతో సీతారామం త‌ర్వాత అమ్మ‌డు ఆచితూచి సినిమాలను సెలెక్ట్ చేసుకుంటుంది. గ‌తేడాది నాని తో హాయ్ నాన్న రూపంలో మ‌రో హిట్ అందుకున్న మృణాల్, త్వ‌ర‌లోనే ఫ్యామిలీ స్టార్ పేరుతో మ‌రోసారి ప్రేక్ష‌కులను ప‌ల‌క‌రించ‌నుంది.  

చూస్తుంటే మృణాల్  తెలుగు సినిమాల‌కు బాగా క‌నెక్ట్ అయిన‌ట్లు అనిపిస్తోంది. అంతే కాదు రీసెంట్ గా ఓ ఇంట‌ర్వ్యూలో మృణాల్ తెలుగు సినిమాల‌కు ఓ రేంజ్ లో ఎలివేష‌న్ ఇచ్చింది. అది కూడా బాలీవుడ్ సినిమాల‌తో పోల్చి మ‌రీ. త‌న‌కు తెలుగులో మంచి క్యారెక్ట‌ర్లు ద‌క్కుతున్నాయ‌ని, బాలీవుడ్ లో అలాంటి క్యారెక్ట‌ర్లు రావ‌డం లేద‌ని చెప్పిన మృణాల్, కెరీర్ స్టార్టింగ్ లో త‌న‌కు బాలీవుడ్ లో ఎన్నో అవ‌మానాలు ఎదురయ్యాయ‌ని చెప్పింది. త‌న‌ను అంద‌రూ ప‌ల్లెటూరి అమ్మాయన్నార‌ని, గ్లామ‌ర్ రోల్స్ కు స‌రిపోన‌ని తీసి ప‌డేశార‌ని, ఆ త‌ర్వాత త‌న‌ను తాను ప్రూవ్ చేసుకున్న‌ట్లు మృణాల్ వెల్ల‌డించింది.  

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :