డిప్రెషన్ లో లేనంటున్న మృణాల్

తెలుగులో సీతారామం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన మృణాల్ ఠాకూర్ మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లోకి చేరింది. ప్రస్తుతం వరుస ఆఫర్లు అందుకుంటూ నార్త్ తో పాటూ సౌత్ లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్ అయింది మృణాల్. ఇంత బిజీగా ఉన్న మృణల్, రీసెంట్ గా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ పోస్ట్ అందిరి దృష్టిని మరల్చింది.
ఆ పోస్ట్ చూసిన చాలా మంది మృణాల్ మానసిక సమస్యలు ఎదుర్కొంటుందని భావించారు. మరి కొంతమంది ఆమె కెరీర్ స్టార్టింగ్ లోనే చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నట్లుగా భావిస్తున్నారు. మొత్తానికి ఆమెకు మానసిక సమస్యలు చాలానే ఉన్నాయని ఆ పోస్ట్ ద్వారా తెలుస్తోందని, ఎవరకి నచ్చినట్లు వారు తమకు తోచినవిధంగా రకరకాలుగా అర్థం చేసుకుని వార్తలు రాశారు.
దీంతో మరోసారి ఈ విషయమై మృణాల్ స్పందించింది. తనకు అంతా బాగానే ఉందని, మానసిక పరిస్థితి కూడా బాగా ఉందని, తాను డిప్రెషన్ లో లేనని క్లారిటీ ఇచ్చింది. తన చుట్టూ జరుగుతున్న విషయాలను, సంఘటనలను చూసి అలా పోస్ట్ చేయాల్సి వచ్చిందని, కొన్ని విపత్కర సమస్యలు కూడా ఎదుర్కొన్నట్లు మృణాల్ పేర్కొంది.
సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసిన విషయంలో క్లారిటీ రావడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇదిలా ఉంటే మృణాల్ నానితో ఓ సినిమాను చేయనున్న విషయం తెలిసిందే. బాలీవుడ్‌లో కూడా రెండు మూడు సినిమాల్లో మృణాల్ నటిస్తోంది.