సీబీఐ విచారణకు హాజరైన ఎంపీ అవినాష్ రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఎస్పీ రాంసింగ్ నేతృత్వంలోని సీబీఐ బృందం అవినాస్ రెడ్డిని ప్రశ్నించింది. ఆయన తరపు న్యాయవాదిని అధికారులు గదిలోకి అనుమతించలేదు. అంతకుముందు తన విచారణను ఆడియో, వీడియోలు రికార్డు చేయాలని తనతో పాటు న్యాయవాదిని కూడా అనుమతించాలని అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులకు లేఖ రాశారు. అయితే ఈ లేఖకు సంబంధించి అధికారులు సమాధానం ఇచ్చారా? లేదా? అనేదానిపై స్పష్టత లేదు. ఇప్పటికే 248 మందిని ప్రశ్నించి వారి నుంచి వాంగ్మూలాన్ని సీబీఐ అధికారులు సేకరించారు. ఇంతమందిని ప్రశ్నించినప్పటికీ తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని మాత్రం ఇప్పటి వరకు ప్రశ్నించలేదు. ప్రతిపక్షాలు కూడా ప్రధానంగా అతనిపై వేలెత్తి చూపుతున్న నేపథ్యంలో పూర్తి సమాచారం సేకరించిన తర్వాతే అవినాష్‌రెడ్డిని ప్రశ్నించాలని సీబీఐ అధికారులు భావించారు. ఇందులో భాగంగానే ఆయనకు నోటీసులు జారీ చేసి విచారణకు హాజరుకావాల్సిందిగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి విచారణకు హాజరయ్యారు.