ASBL Koncept Ambience
facebook whatsapp X

ఒడిశా నూతన సీఎంగా మోహన్ మాఝీ ప్రమాణ స్వీకారం

ఒడిశా నూతన సీఎంగా మోహన్ మాఝీ ప్రమాణ స్వీకారం

ఒడిశాలో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వం కొలువుతీరింది. నూతన సీఎంగా మోహన్‌ మాఝీ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌ రఘుబర్‌దాస్‌ చేతులు మీదుగా  ఈ కార్యక్రమం జరిగింది. డిప్యూటీ  సీఎంలుగా కనక్‌ వర్ధన్‌ సింగ్‌ దేవ్‌, ప్రవతి పరీదా ప్రమాణ స్వీకారం చేశారు. భువనేశ్వర్‌లోని జనతా మైదాన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, జేపీ నడ్డా సహా పలువురు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు,  ఒడిషా మాజీ సీఎం నవీన్‌ పట్నాయక్‌, బీజేపీ అగ్రనేతలు హాజరయ్యారు.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :