అలా చెప్పడం పోలీసులకు సిగ్గుచేటుగా లేదా?
తెలుగుదేశం పార్టీ పులివెందుల నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి అరెస్ట్ విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు అభ్యంతరకమరని ఆ పార్టీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 10 నెలలుగా బీటెక్ రవి అందుబాటులో లేనందున ఆయన్ను అరెస్ట్ చేయలేకపోయామని చెప్పడం పోలీసులకు సిగ్గు చేటుగా లేదా అని ప్రశ్నించారు. అందుబాటులో లేని వ్యక్తి 10 రోజుల క్రితం జిల్లా ఎస్పీని ఎలా కలిశారని అన్నారు. ఎఫ్‌ఐఆర్‌లో 324 సెక్షన్ పెట్టారని, రిమాండ్ రిపోర్టులో 333 సెక్షన్‌గా మార్చాల్సిన అవసరమేంటని నిలదీశారు.
Tags :