Radha Spaces ASBL

వైఎస్ కుమార్తె కాబట్టి బాపట్ల దాటగలిగారు.. వేరే వాళ్లయితేనా?

వైఎస్ కుమార్తె కాబట్టి  బాపట్ల దాటగలిగారు.. వేరే వాళ్లయితేనా?

బాపట్ల సభలో సీఎం జగన్‌, తనపైనా వైఎస్‌ షర్మిల తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనిఎమ్మెల్యే కోన రఘుపతి మండిపడ్డారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తమపై తీవ్ర విమర్శలు చేసిన షర్మిల వైఎస్‌ కుమార్తె కావడం వల్లే బాపట్ల దాటనిచ్చామన్నారు. వైఎస్‌పై ఉన్న అభిమానంతో ఆమెను క్షమిస్తున్నట్లు చెప్పారు. షర్మిల కాకుండా మరో నేత ఎవరైనా అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే పట్టణం దాటేవారు కాదన్నారు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ఎన్ని హామీలు ఇచ్చిన ప్రజలు నమ్మరన్నారు. ఎంతమంది నాయకులు వచ్చినా జగన్‌ను ఏమీ చేయలేరన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :