న్యూయార్క్ లో మంత్రి కేటీఆర్ కు ఘన స్వాగతం

అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజినీర్స్(ఏఎస్‌సీఈ) ఆధ్వర్యంలోని ప్రపంచ పర్యావరణ, నీటి వనరుల కాంగ్రెస్ (మే 21-25)లో పాల్గొనేందుకు కేటీఆర్ అమెరికా చేరుకున్నారు. న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్ కెన్నెడీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఈ సదస్సులో ఆయన మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులపై ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా పెట్టుబడుల కోసం పలువురు పారిశ్రామికవేత్తలు, దిగ్గజ సంస్థల ప్రతినిధులతో సమావేశం కానున్నారు.
Tags :