ASBL Koncept Ambience
facebook whatsapp X

దేశంలోనే ఇది ఒక రికార్డు : మంత్రి హరీశ్ రావు

దేశంలోనే ఇది ఒక రికార్డు : మంత్రి హరీశ్ రావు

వైద్యరంగంలో అత్యంత పారదర్శకంగా నియామకాలు జరుగుతున్నాయని తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. కొత్తగా ఎంపికైన 1061 అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు మంత్రి నియామకపత్రాలు అందజేశారు. శిల్పకళా వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో హరీశ్‌ రావు పాల్గొని ప్రసంగించారు.  వైద్య విద్యలో దేశంలోనే ఇది ఒక రికార్డు అని తెలిపారు.  80 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టామని తెలిపారు. 1,331 మంది ఆయుష్‌ కాంట్రాక్టు సిబ్బందిని క్రమబద్ధీకరించామన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత 22,263 మందికి ఆరోగ్యశాఖలో ఉద్యోగాలిచ్చాం. మరో 9,222 పోస్ట్‌లకు రెండు నెలల్లో నోటిఫికేషన్‌ ఇస్తాం. రోగుల ఆరోగ్యానీ నమయం చేయగల శక్తి వైద్యులకు ఉంటుంది. వైద్యులు సమాజానికి మంచి సేవలు అందించాలి. వచ్చే నెల నుంచి టి డయాగ్నస్టిక్స్‌లో 134 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తాం. ప్రస్తుతం 54 పరీక్షలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రానికి ఒక ఎయిమ్స్‌ ఇచ్చినందుకు బీజేపీ నేతలు చాలా హడావుడి చేశారు. బీఆర్‌ఎస్‌ ఒకే ఏడాదిలో తొమ్మిది కాలేజీలు ఏర్పాటు చేసింది. ఒక్కో మెడికల్‌ కాలేజీకి సుమారు రూ.500 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ప్రతి లక్ష మందికి 22 ఎంబీబీఎస్‌ సీట్లతో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది అని అన్నారు.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :