ఏపీ పెవిలియన్ ను ప్రారంభించిన మంత్రి అమర్‌నాథ్

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు అనువైన పరిస్థితులు, విస్తృత అవకాశాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో నిర్వహిస్తున్న ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్‌లో ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్‌ను మంత్రి అమర్‌నాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అన్ని వనరులను సమకూర్చడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు. ఏపీ ఉన్నతాధికారులు కె.సునీత, హిమాన్షు కౌశిక్, మోపర్తి సుధాకర్, భాను సాయిపత్రాప్ పాల్గొన్నారు.







Tags :