MKOne TeluguTimes-Youtube-Channel

ఆయన తీరువల్ల అమెరికా అనేక మంది వీరులను : మైక్ పాంపియో

ఆయన తీరువల్ల అమెరికా అనేక మంది వీరులను :  మైక్ పాంపియో

తను కలిసిన ప్రపంచ నాయకుల్లో అఫ్గానిస్థాన్ ప్రధాని అష్రాప్ ఘనీ అత్యంత అవినీతిపరుడని అమెరికా మాజీ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఆరోపించారు. ఆయన ఇటీవల రాసిన పుస్తకంలో అఫ్గాన్ వ్యవహారాలపైనా తన అనుభవాలను పంచుకున్నారు. అష్రాప్ ఘనీ, ఆ దేశ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అబ్దుల్లా అబ్దుల్లాలు అత్యంత అవినీతిపరులను పాంపియో అభివర్ణించారు. ఘనీ ఎప్పుడూ పదవి కోసమే తాపత్రయపడుతూ తాలిబన్లతో శాంతి ఒప్పందాలకు అడ్డుగోడగా ఉండేవారని తెలిపారు. ఆయన తీరువల్ల అమెరికా అనేక మంది వీరులను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఘనీతో చర్చల్లో కూర్చున్నపుడు కిమ్, జిన్పింగ్, పుతిన్లను ఒకేసారి కలిసినట్లు ఉండేదని పేర్కొన్నారు. అసలు ప్రభుత్వం ఉంటుందా ఉండదా అనేది ఆలోచించకుండా ఘనీ, అబ్దుల్లా అబ్దుల్లా పదవి కోసం పాకులాడేవారని పాంపియో తన పుస్తకంలో విమర్శలు గుప్పించారు.

 

 

Tags :