ASBL Koncept Ambience
facebook whatsapp X

జో బైడెన్‌ స్థానంలో మిషెల్‌ ఒబామా?

జో బైడెన్‌ స్థానంలో మిషెల్‌ ఒబామా?

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థిగా జో బైడెన్‌ స్థానంలో మాజీ అధ్యక్షుడు ఒరాక్‌ ఒబామా భార్య మిషెల్‌ ఒబామాను బరిలో నిలుపుతారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. తొలి ప్రెసిడెన్షియల్‌ డిబేట్‌లో బైడెన్‌ పలుమార్లు తడబాటుగా మాట్లాడటంతో ఆ పార్టీలో ఆందోళన వ్యక్తమవుతోంది. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో జరిగిన డిబేట్‌లో బైడెన్‌ తేలిపోయారనే విమర్శలు వస్తున్నాయి. అధ్యక్ష ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని డెమోక్రాట్లు ఆందోళన చెందుతున్నారు. అధ్యక్ష రేసు నుంచి బైడెన్‌ తప్పుకోవాలనే డిమాండ్లు వస్తున్నాయి. 

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మూడు నెలలు ముందు ఆగస్టులో జరిగే డెమోక్రాటిక్‌ నేషనల్‌ కన్వెన్షన్‌లో ఆ పార్టీ అభ్యర్థిగా మిచెల్‌ ఒబామా ప్రకటించే అవకాశాలున్నాయని  డెమోక్రాట్లు అభిప్రాయపడుతున్నారు. తొలి డిబేట్‌లో బైడెన్‌ ఘోరంగా విఫలమయ్యారు. ఆయన తీరుతో దేశవ్యాప్తంగా డెమోక్రాట్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. డెమోక్రాటిక్‌ అభ్యర్థిగా బైడెన్‌ తొలగించి మిచెల్‌ ఒబామాను బరిలో నిలిపాలి.  ఆగస్టులో జరిగే డెమోక్రాటిక్‌ నేషనల్‌ కన్వెన్షన్‌లో ఈ మార్పు జరుగుతుంది అని యూఎస్‌ సెనెటర్‌ టెడ్‌ క్రజ్‌ పేర్కొన్నారు. 
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :