Radha Spaces ASBL

మెగాస్టార్ చిరంజీవి, 'విశ్వంభర' కీలక యాక్షన్ షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం

మెగాస్టార్ చిరంజీవి, 'విశ్వంభర' కీలక యాక్షన్ షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం

మెగాస్టార్ చిరంజీవి మాగ్నమ్ ఓపస్ విశ్వంభర. వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. బ్లాక్‌బస్టర్ 'బింబిసార'ను అందించిన తర్వాత వశిష్ట, మెగాస్టార్ చిరంజీవిని దర్శకత్వం వహించే అవకాశాన్ని అందుకున్నారు. ఈ ట్యాలెంటెడ్ డైరెక్టర్ మెగాస్టార్‌ను లార్జర్ దెన్ లైఫ్ పాత్రలో ప్రెజెంట్ చేయడానికి హ్యుజ్ స్పాన్ వున్న కథను సిద్ధం చేశాడు. యూవీ క్రియేషన్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష కృష్ణన్ కథానాయిక. ఇటీవలే కొన్ని టాకీ పార్ట్‌లు, ఒక పాట, ఒక యాక్షన్ బ్లాక్‌ని చిత్రీకరించిన షెడ్యూల్‌ను ముగించిన మేకర్స్, హైదరాబాద్‌లో కీలకమైన యాక్షన్ షెడ్యూల్‌ను ప్రారంభించారు.

ఫైట్ మాస్టర్స్ ద్వయం రామ్-లక్ష్మణ్ పర్యవేక్షణలో హైదరాబాద్‌లోని అల్లుమియం ఫ్యాక్టరీలో చిరంజీవి, కొంతమంది ఫైటర్స్‌పై ప్రస్తుతం హై-ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. యాక్షన్ సీక్వెన్స్‌ను గ్రాండ్ స్కేల్ లో రూపొందిస్తున్నారు. కీలకమైన దశలో వచ్చే ఈ యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులకు అడ్రినలిన్ రష్‌ని అందిస్తుంది.

విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ మెగా ఫాంటసీ అడ్వెంచర్ రిచ్ ప్రొడక్షన్, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో అద్భుతంగా వుండబోతోంది. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా, శ్రీ శివశక్తి దత్తా, చంద్రబోస్ లిరిక్ రైటర్స్. విశ్వంభర 2025 సంక్రాంతికి జనవరి10న విడుదల కానుంది.

 

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :