ASBL NSL Infratech

వ‌రుణ్ తేజ్ కు గేమ్ ఛేంజ‌ర్ గురించి ప్ర‌శ్న‌లు

వ‌రుణ్ తేజ్ కు గేమ్ ఛేంజ‌ర్ గురించి ప్ర‌శ్న‌లు

ఎప్పుడో మూడేళ్ల కింద‌ట మొద‌లైంది గేమ్ ఛేంజ‌ర్ సినిమా. ఆర్ఆర్ఆర్ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ నుంచి సోలోగా వ‌స్తున్న సినిమా కావ‌డం, దానికి డైరెక్ట‌ర్ శంక‌ర్ కావ‌డంతో మెగా ఫ్యాన్స్ మొద‌ట్లో తెగ సంబ‌ర‌ప‌డి పోయారు. కానీ ఇప్పుడు అదే మెగా ఫ్యాన్స్ త‌మ స‌హ‌నాన్ని కోల్పోతున్నారు. దానికి కార‌ణం గేమ్ ఛేంజ‌ర్ లేట్ అవ‌డ‌మే.

ఇప్ప‌టివ‌ర‌కు సినిమా గురించి ఎలాంటి అప్డేట్ లేక‌పోవ‌డంతో ఫ్యాన్స్ అస‌హ‌నానికి గుర‌వుతున్నారు. ఇందులో భాగంగానే మెగా ఫ్యాన్స్ ఆప‌రేష‌న్ వాలెంటైన్ ట్రైల‌ర్ లాంచ్ లో వ‌రుణ్ తేజ్ ను గేమ్ ఛేంజ‌ర్ అప్డేట్ గురించి అడిగారు. చ‌ర‌ణ్‌కు ఫోన్ చేసి సినిమా గురించి ఏదైనా ఇన్ఫ‌ర్మేష‌న్ చెప్ప‌మ‌ని అడ‌గండ‌ని  వేడుకోవ‌డం ప్ర‌స్తుతం నెట్టింట వైర‌లవుతోంది.

దానికి వ‌రుణ్ స‌మాధాన‌మిస్తూ ఇవాళ పొద్దున కూడా మాట్లాడాన‌ని, రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జ‌రుగుతోందని, అతి త్వ‌ర‌లోనే మీకు గుడ్ న్యూస్ వ‌స్తుంద‌ని త‌న‌కు చేతనైనంత‌లో క‌వ‌ర్ చేశాడు. వాస్త‌వానికి ఈ ప్ర‌శ్నకు అది సంద‌ర్భం కాదు. కానీ ఏం చేస్తారు మెగా ఫ్యాన్స్ అసంతృప్తి, అస‌హనం ఆ రేంజ్ లో ఉన్నాయి మ‌రి.

అప్ప‌ట్లో గేమ్ ఛేంజ‌ర్ నిర్మాత దిల్ రాజు సినిమాను సెప్టెంబ‌ర్ లో రిలీజ్ చేస్తామ‌న్నాడు. కానీ అది వ‌ర్క‌వుట్ అయ్యేట్లు క‌నిపించ‌డం లేదు. ఇక సంక్రాంతికి అనుకుంటే విశ్వంభ‌ర ఉంది. ఇప్పుడేమో డిసెంబ‌ర్ అని మ‌రో కొత్త ప్ర‌చారం మొద‌లైంది. ఏదేమైనా గేమ్ ఛేంజ‌ర్ షూటింగ్ ఎప్ప‌టికి పూర్త‌వుతుంద‌నేది శంక‌ర్ కు త‌ప్ప మ‌రెవ‌రికీ తెలియ‌దు. మ‌రి గేమ్ ఛేంజ‌ర్ కు శంక‌ర్ ఎప్పుడు గుమ్మ‌డికాయ కొట్టి, రిలీజ్ కు ఏ ముహూర్తాన్ని ఫిక్స్ చేస్తాడో చూడాలి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :