తెలుగు నటికి అరుదైన గుర్తింపు
తెలుగమ్మాయి, ఇండియన్ అమెరికన్ నటి అవంతిక వందనపునకు అరుదైన గుర్తింపు లభించింది. ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ యూనివర్సిటీ ఆమెను దక్షిణాసియా పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా ప్రకటించింది. మీన్ గర్ల్స్ సినిమాలో తన నటనతో అలరించిన ఆమె నట ప్రస్తావం ఇప్పుడే మొదలైందని కితాబిచ్చింది. తన అద్భుత నటనా ప్రదర్శనతో అంతర్జాతీయ, భారతీయ వినోద పరిశ్రమలపై ఆమె చెప్పుకోదగ్గ ప్రభావాన్ని చూపిందని కొనియాడింది. తనకు హార్వర్డ్ పురస్కారం లభించడంపై అవంతిక హర్షం వ్యక్తం చేశారు. ప్రతిష్ఠాత్మక సంస్థ నుంచి ఈ గౌరవాన్ని పొందడం నిజంగా నమ్మశక్యం కాని ప్రేరణ కలిగిస్తున్నది. ఇది నా ప్రయత్నాన్ని గుర్తించడమే కాదు, దేశాల హద్దులు దాటిన కథనాల ప్రాముఖ్యతను, ప్రపంచ మీడియాలో భారతదేశం పోషిస్తున్న కీలక పాత్రను గుర్తిస్తున్నది అని తెలిపారు. ఇండియన్ ఓటీటీ బిగ్ గర్ల్స్ డోంట్ క్రై అవంతికకు మంచి గుర్తింపు తెచ్చింది. ప్రస్తుతం ఆమె పలు హాలీవుడ్ ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు. బాల నటిగా పలు తెలుగు సినిమాల్లో నటించారు.