Radha Spaces ASBL

వినోదాన్ని పంచిన మాయాబజార్‌ 2023

వినోదాన్ని పంచిన మాయాబజార్‌ 2023

బే ఏరియాలో వేసవి వినోదాన్ని అందించే మాయాబజార్‌ 2023 వేడుకలు ఈసారి కూడా ఘనంగా జరిగాయి. అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండోఅమెరికన్స్‌ (ఎఐఎ) ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుక వచ్చినవారిని ఉల్లాసపరిచింది. ఆకట్టుకునేలా కార్యక్రమాలు, ఆకర్షించేలా ఏర్పాట్లు వచ్చినవారికి ఎంతో ఆనందాన్ని పంచింది.  ఈవెంట్‌ పార్టనర్‌గా సిటీ ఆఫ్‌ శాన్‌ రామన్‌, బాలీ 92.3 ఎఫ్‌ఎం ద్వారా సహ-స్పాన్సర్‌ చేయడం జరిగింది. అతిపెద్ద హస్తకళా ప్రదర్శన ‘‘క్రాఫ్ట్స్‌ బజార్‌’’ కాన్సులేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఓ) డా. టివి నాగేంద్ర ప్రసాద్‌ సహకారంతో ఏర్పాటు చేశారు. భారతదేశంలోని 20 కంటే ఎక్కువ రాష్ట్రాలు, తమ సంస్కృతికి సంబంధించి, తమ ప్రాంతానికి సంబంధించిన ప్రత్యేకమైన కళారూపాలను ఇందులో ప్రదర్శించాయి. 

ఈ ఈవెంట్‌కు గ్రాండ్‌ స్పాన్సర్‌ గా సంజీవ్‌ గుప్తా సిపిఎ, పవర్‌డ్‌ బై రియల్టర్‌ నాగరాజ్‌ అన్నయ్య, సమర్పణ రైట్‌ బైట్‌ డెంటల్‌ వ్యవహరించింది. ఇతర స్పాన్సర్‌లలో ఎన్‌బిసి బేఏరియా, ఐసిఐసిఐ బ్యాంక్‌, ట్రావెలోపాడ్‌ ఉన్నాయి.

మాయాబజార్‌ కార్యక్రమం ఉదయం 11 గంటలకు ప్రారంభమై రాత్రి 7 గంటల వరకు సాగింది.  భారతీయ సాంస్కృతిక మరియు కళారూపాలను ప్రదర్శించడం మరియు ప్రచారం చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. చోటా భీమ్‌ వంటి ప్రత్యక్ష పాత్రలు ఈ కార్యక్రమాల్లో ఉన్నాయి, అవి జనంతో కలిసిపోయాయి. పిల్లల కోసం అనేక కార్నివాల్‌ గేమ్‌లు కూడా ఏర్పాటు చేశారు. జంగిల్‌ బుక్‌ (జిఫ్ఫీ పెంపుడు జంతువులు), వాటర్‌ రోలర్‌లు, విఆర్‌ గేమ్‌లు, టాయ్‌ ట్రైన్స్‌ వంటివి ఆకట్టుకున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కూచిపూడి, భరతనాట్యం, కథక్‌ శాస్త్రీయ నృత్యాలు, బాలీవుడ్‌ మరియు టాలీవుడ్‌ నృత్యాలు ప్రేక్షకులను బాగా అలరించాయి. ఎఐఎ, బాటా, ఇబికె సంగీత బృందాలకు చెందిన గాయకులు సూపర్‌ హిట్‌ పాటలను అందించారు. మదర్స్‌ డే సందర్భంగా ప్రత్యేకంగా ‘‘అమ్మ ` నేను’’ ఫ్యాషన్‌ షో ఏర్పాటు చేశారు. మిర్చ్‌ మసాలా - ఫుడ్‌ ఫెస్టివల్‌ ఒకే పైకప్పు క్రింద ప్రత్యేకమైన ప్రదర్శనతో వివిధ రుచికరమైన వంటకాలను తీసుకువచ్చింది. 75 మంది విక్రేతలు ఈవెంట్‌ లో స్టాల్స్‌ ఏర్పాటు చేశారు. దుస్తులు, నగలు, దంతవైద్యులు, మెహందీ, రియల్‌ ఎస్టేట్‌, పాఠశాల, ఐటీ శిక్షణ, ఆరోగ్య సేవలు, సంగీత పాఠశాలలు, ‘‘తెలుగు పాఠశాలలో విస్తరించి ఉన్న బూత్‌లను ప్రదర్శించారు. తానా (తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా) - బోన్‌ మ్యారో డ్రైవ్‌ నిర్వహించింది. ఎఐఎ బృందం భారత కాన్సుల్‌ జనరల్‌ డా. టీవి. నాగేంద్ర ప్రసాద్‌ ను సన్మానించింది. ఈ కార్యక్రమానికి ఇతర ప్రముఖులు కూడా హాజరయ్యారు.   

ఈవెంట్‌ను గ్రాండ్‌గా విజయవంతం చేయడంలో కృషి చేసిన వాలంటీర్లందరికీ ఎఐఎ బృందం ధన్యవాదాలు తెలిపింది.

అమెరికన్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ బీహార్‌, ఆశాజ్యోతి సంస్థ, రాజస్థాన్‌ అసోసియేషన్‌ (బే ఏరియా) అగస్త్య, యుఎస్‌ఎ, బీహార్‌ ఫౌండేషన్‌, కాలిఫోర్నియా బ్రాంచ్‌, బే ఏరియా తెలుగు అసోసియేషన్‌, బే ఏరియా తమిళ్‌ మన్రం, బే మలయాళీ, బీహార్‌ అసోసియేషన్‌, బ్రహ్మ కుమారీలు, బేఏరియా దేశీ గార్డెన్‌ ఉత్సాహం (బ్యాడ్జ్‌) డాన్స్‌ కరిష్మా, ఈస్ట్‌ బే కరోకే, ఫెడరేషన్‌ ఆఫ్‌ మలయాళీ అసోసియేషన్స్‌ ఆఫ్‌ అమెరికా, గుజరాతీ కల్చరల్‌ అసోసియేషన్‌, గ్లోబల్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ది పీపుల్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆరిజిన్‌, భారత అక్షరాస్యత ప్రాజెక్ట్‌, ఇండో అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ బే ఏరియా, ఇండో-అమెరికన్‌ కమ్యూనిటీ ఫెడరేషన్‌, కన్నడ కూట ఆఫ్‌ ఉత్తర కాలిఫోర్నియా, కాశ్మీరీ టాస్క్‌ ఫోర్స్‌, మహారాష్ట్ర మండల్‌ బే ఏరియా, నాయర్‌ సర్వీస్‌ సొసైటీ, ఎన్‌కెడి ఆర్ట్స్‌, నాచాజి, ఓఎస్‌ఎ (కాలిఫోర్నియా చాప్టర్‌), పాఠశాల (తెలుగు పాఠశాల), పంజాబీ కల్చరల్‌ అసోసియేషన్‌, ప్రోథోమా - నార్కల్‌ బెంగాలీ అసోసియేషన్‌, రోటరీ ఇంటర్నేషనల్‌, సేవా ఇంటర్నేషనల్‌, శాన్‌ రామన్‌ క్రికెట్‌ అసోసియేషన్‌, శంకర ఐ ఫౌండేషన్‌, స్పందన సంస్థ, తానా (తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా), టిసిఎ (తెలంగాణ కల్చరల్‌ అసోసియేషన్‌), టిడిఎఫ్‌ తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరమ్‌, ట్రై వ్యాలీ కన్నడ సంఘం, యునైటెడ్‌ ఫిజీ అసోసియేషన్‌, యుపిఎంఎ (ఉత్తర ప్రదేశ్‌ మండలం), వేద టెంపుల్‌, వొక్కలిగ పరిషత్‌ ఆఫ్‌ అమెరికా, విటిసేవ వంటి సంస్థలు ఇందులో పాల్గొన్నాయి.
 

Click here for Event Gallery

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :