ASBL NSL Infratech

ఇసుకతుపానుతో చైనా విలవిల

ఇసుకతుపానుతో చైనా విలవిల

ఇటీవలి కాలంలో డ్రాగన్ కంట్రీపై ప్రకృతి కన్నెర్ర జేస్తోంది. ఓవైపు మంచుతుఫాన్లు విరుచుకుపడుతుంటే.. మరోవైపు ఇసుక తుపాన్ విధ్వంసం సృష్టిస్తోంది. తాజాగా చైనాలోని షింజియాంగ్‌ రాష్ట్రం.. ఇసుక తుపాను ధాటికి విలవిలలాడింది. కనీసం 100 మీటర్ల దూరంలోని వాహనాలు కూడా కనిపించనంత తీవ్రంగా ఇది నగరాలను కమ్మేసింది. ఆకాశం, వాతావరణం పూర్తిగా ఆరెంజ్‌ రంగులోకి మారిపోయాయి. దీంతో రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు అధికారులు అత్యవసర చర్యలు చేపట్టారు. ఇప్పటికే బలమైన గాలులతో కూడిన ఇసుక తుపాను వస్తుందని చైనా వాతావరణ శాఖ అత్యంత తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది. ఫిబ్రవరి 22వ తేదీ వరకు ఉష్ణోగ్రతలు కూడా భారీగా పడిపోతాయని పేర్కొంది.

షింజియాంగ్‌ ప్రావిన్స్‌లోని టుర్పాన్‌ నగరంలో ఈ ఇసుక తుపాన్‌ దెబ్బకు రహదారులపై చీకటి అలముకొంది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వేలాదిమంది వీటిల్లో చిక్కుకుపోయారు. వీరిని పోలీసులు, ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక షింజియాంగ్‌ పొరుగున ఉన్న షాక్సీ ప్రావిన్స్‌లో చాలా నగరాలు దుమ్ముతో కమ్ముకుపోయాయి. గుంసు ప్రావిన్స్‌లోని జ్యూకాన్‌ నగరం వద్ద జాతీయ రహదారిని మూసివేశారు. దాదాపు 40,000 మంది ప్రయాణికులు రోడ్డు పక్కనే ఉండిపోవాల్సి వచ్చింది. 200 మీటర్ల ఎత్తులో సుడిగాలిలా ఇసుక తుపాను వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. మండుటెండలో సూర్యుడిని ఈ భారీ ఇసుకతుపాను కమ్మేసినట్లు తెలిపారు.

అయితే ఈతుపాను వల్ల ఎలాంటి ప్రాణనష్టం కలగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఇసుక తుపానుకు పొగమంచు తోడు కావడంతో పరిస్థితి దారుణంగా మారిపోయింది. పలు చోట్ల ఉష్ణోగ్రత భారీగా పడిపోయింది. ఈ తుపాను దెబ్బకు వాతావరణంలో వ్యాపించిన దుమ్ము కారణంగా చాలా మంది ప్రజలకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చన్న భయాలు నెలకొన్నాయి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :