ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

బ్యూటీ మారుతికి మ‌రో బేబీ అవుతుందా?

బ్యూటీ మారుతికి మ‌రో బేబీ అవుతుందా?

మారుతి ఓ వైపు సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూనే మ‌రోవైపు చిన్న‌, మంచి సినిమాల‌ను ప్రోత్స‌హిస్తూ నిర్మాత‌గా, ప్రెజెంటర్ గా కూడా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నాడు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ తో రాజా సాబ్ సినిమా చేస్తున్న మారుతి, ఆ సినిమాను విజువ‌ల్ ఫీస్ట్ గా ఆడియ‌న్స్ కు ప్రెజెంట్ చేయ‌బోతున్నాడ‌ట‌. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన తాజా షెడ్యూల్ హైద‌రాబాద్ లో స్టార్ట్ అవ‌గా, అందులో ప్ర‌భాస్ కూడా పాల్గొంటున్నాడు.

ఓ వైపు రాజా సాబ్ సినిమా చేస్తూనే మారుతి, మ‌రోవైపు కొత్త సినిమాను నిర్మిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ నెల 22న ఆ సినిమా మొద‌లుకానుంది. సుబ్ర‌హ్మ‌ణ్యం ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాను మారుతి, జీ స్టూడియోస్ సంస్థ‌తో క‌లిసి నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు బ్యూటీ అనే టైటిల్ ను ఫిక్స్ చేసిన‌ట్లు స‌మాచారం. యూత్ తో పాటూ ఫ్యామిలీ ఆడియ‌న్స్ కు న‌చ్చే విధంగా ఈ సినిమాను తెర‌కెక్కించ‌నున్నార‌ట‌.

మారుతి నిర్మాణంలో గ‌తేడాది చిన్న సినిమాగా వ‌చ్చి బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన బేబీ అత‌నికి ఎలాంటి లాభాల‌ను తెచ్చిపెట్టిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. గ‌తేడాది బేబీ మూవీకి కో ప్రొడ్యూస‌ర్ గా వ్య‌వ‌హ‌రించిన మారుతి ఇప్పుడు బ్యూటీ సినిమాకు కో ప్రొడ్యూస‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న ఏప్రిల్ 22న వ‌చ్చే అవ‌కాశ‌ముంది. విజ‌య్ బుల్గానిన్ సంగీతం అందించ‌నున్న ఈ సినిమాలో అంద‌రూ కొత్త న‌టీన‌టులే ఉండ‌నున్నార‌ట‌. మారుతికి ఈ సినిమా మ‌రో బేబీ అవుతుందేమో చూడాలి మ‌రి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :