ASBL NSL Infratech

మంచు ఫ్యామిలీలోకి అడుగుపెట్టిన మ‌రో ఆడ‌పులి

మంచు ఫ్యామిలీలోకి అడుగుపెట్టిన మ‌రో ఆడ‌పులి

టాలీవుడ్ యంగ్ హీరో మంచు మ‌నోజ్ గ‌తేడాది భూమా మౌనికను పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ పెళ్లి బాధ్య‌త‌ల‌ను మొత్తం మంచు ల‌క్ష్మి ద‌గ్గ‌రుండి మ‌రీ చూసుకుంది. అతి త‌క్కువ మంది సన్నిహితుల మ‌ధ్య‌లో వీరి వివాహం జ‌రిగింది. పెళ్లి త‌ర్వాత వీరిద్ద‌రూ ఎక్కిడికి వెళ్లినా జంట‌గా క‌నిపిస్తూ సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తూ వ‌చ్చారు.

మౌనిక కొడుకుని కూడా మ‌నోజ్ త‌న సొంత కొడుకులా చూసుకుంటున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా భూమా మౌనిక మ‌రో ఆడ‌పిల్ల‌కు జ‌న్మ‌నిచ్చిన‌ట్లు మ‌నోజ్ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. మంచు ల‌క్ష్మి కూడా ఈ సంద‌ర్భంగా వారిద్ద‌రినీ కంగ్రాట్యులేట్ చేస్తూ త‌మ ఫ్యామిలీలోకి పులిబిడ్డ వ‌చ్చిందంటూ ట్వీట్ చేసింది.

మంచు మ‌నోజ్, మౌనిక‌ల కూతురు ముద్దు పేరు ఎంఎం పులి అని, అంద‌రూ ఆప్యాయంగా అలాగే పిలుస్తున్నామంటూ ల‌క్ష్మి షేర్ చేసింది. పాప రాక‌తో మంచు ఫ్యామిలీ ఎంతో సంతోషంగా ఉంద‌ని ఆమె తెలిపుతూ దాంతో పాటూ ఒక చిన్న పాప పులి ఒడిలో నిద్ర పోతున్న ఫోటోను కూడా మంచు ల‌క్ష్మి షేర్ చేసింది. ప్ర‌స్తుతం మంచు ల‌క్ష్మి పెట్టిన ట్వీట్ నెట్టింట వైర‌ల్ అవుతుంది. ఇక మ‌నోజ్ విషయానికొస్తే గ‌త కొంత‌కాలంగా సినిమాల‌కు దూరంగా ఉంటున్న మ‌నోజ్, త్వ‌ర‌లోనే మ‌ళ్లీ కెరీర్లో బౌన్స్ బ్యాక్ అవాల‌ని క‌థ‌లు వినే పనిలో ఉన్నాడు. ఈలోగా మ‌నోజ్ ఉస్తాద్ అనే గేమ్ షో కు హోస్ట్ గా ఆడియ‌న్స్ కు ట‌చ్ లో ఉన్నాడు.  

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :