మరోసారి డిజప్పాయింట్ చేసిన బేబమ్మ
మూడేళ్ల కిందట వచ్చిన ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ డెబ్యూ అందుకుంది కృతి శెట్టి. ఆ సినిమా తర్వాత అమ్మడికి ఆఫర్లు క్యూ కట్టాయి. వరుణ్ తేజ్ కంటే ఎక్కువ అవకాశాలు కృతికే వచ్చాయి. తక్కువ టైమ్ లోనే మంచి హీరోయిన్ అవుతుందనుకున్నారు. దానికి తగ్గట్లే శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాల విజయాలు దక్కాయి.
కానీ అమ్మడి నుంచి తర్వాత వచ్చిన ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి డిజాస్టర్లయ్యాయి. దీంతో క్రమంగా టాలీవుడ్ నుంచి అవకాశాలు తగ్గాయి. ఎట్టకేలకు శర్వానంద్ సరసన మనమే సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ అందుకుని మళ్లీ టాలీవుడ్ లో నిలదొక్కుకోవాలని చూసింది కృతి.
కానీ ఏం లాభం? మనమే సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. ఫ్లాప్ కాలేదు కానీ అలా అని సినిమా హిట్ కూడా కాలేదు. వీకెండ్ వరకు మంచి వసూళ్లనే అందుకున్న మనమే తర్వాత స్లో అయింది. ఫలితంగా ఈ సినిమా వల్ల కృతికి ఒరిగిందేమీ లేదు. ఇదిలా ఉంటే కృతి ప్రస్తుతం తమిళంలో మూడు సినిమాలు చేస్తోంది. టాలీవుడ్ లో కాకపోయినా అక్కడ హిట్ కొట్టినా ఏదొక భాషలో ఛాన్సులొచ్చే ఛాన్సుంది. మరి అమ్మడు కోలీవుడ్ లో ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.