ASBL Koncept Ambience
facebook whatsapp X

రివ్యూ : సరికొత్త ప్రేమకథా చిత్రం 'మాధవే మధుసూదన' 

రివ్యూ : సరికొత్త ప్రేమకథా చిత్రం 'మాధవే మధుసూదన' 

తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 2.75/5
బ్యానర్ : సాయి రత్న క్రియేషన్స్
నటీనటులు : తేజ్ బొమ్మదేవర, రిషికి లొక్రే‌, జోష్ రవి, శివ, జయ ప్రకాష్, ప్రియ, తదితరులు
సంగీతం : వికాస్ బాడిస, కెమెరామెన్ : వాసు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : మానుకొండ మురళీ, సమర్పణ : బొమ్మదేవర శ్రీదేవి
దర్శక, నిర్మాత : బొమ్మదేవర రామచంద్ర రావు
విడుదల తేదీ: 24.11.2023

ప్రేమ కథా చిత్రాలకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. ప్రతీ సినిమాలోని  ప్రేమ అనే ఎపిసోడ్ కచ్చితంగా ఉంటుంది. అలాంటి ప్రేమ నేపథ్యంలోనే పూర్తిగా చిత్రం తీస్తే అదే 'మాధవే మధుసూదన'.కింగ్ నాగార్జున పర్సనల్ మేకప్ మాన్ గా, నంది అవార్డు గ్రహీతగా సినిమా ఇండస్ట్రీ లో పరిచయం వున్నా బొమ్మదేవర రామచంద్ర రావు (చంద్ర) నిర్మాత గా తొలి చిత్రం 'పంచాక్షరీ'. దర్శక, నిర్మాత గా  తన రెండవచిత్రం 'మాధవే మధుసూదన', ఈ ప్రేమ కథా చిత్రాన్ని మనసుకు హత్తుకునేలా తీశారు. ఆయన తనయుడు  తేజ్ బొమ్మదేవర హీరోగా పరిచయం చేస్తూ....ఈ చిత్రంలో రిషికి లొక్రే‌ హీరోయిన్‌గా సాయి రత్న క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తూ దర్శకత్వం బొమ్మదేవర రామచంద్ర రావు. ఈ రోజు నవంబర్ 24న ఈ  చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఓ సారి రివ్యూ లో చూద్దాం.

కథ:

మాధవ్ (తేజ్ బొమ్మదేవర) స్నేహితులు రవి (జోష్ రవి), శివ (శివ)లతో కలిసి జాలీగా తిరుగుతూ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంటాడు. అలా తిరుగుతున్న కొడుకుని చూసి బాధపడుతుంటారు తల్లిదండ్రులు. ఆఫీస్‌ బాధ్యతలు చూసుకోమని మాధవ్‌ను బెంగళూరు వెళ్లమని చెబుతుంది తల్లి (ప్రియ). తండ్రి (జయ ప్రకాష్) కూడా వెళ్లమని సలహా ఇస్తాడు. అలా బెంగళూరుకు వెళ్లాల్సిన మాధవ్ వైజాగ్ ట్రైన్ ఎక్కి అరుకు చేరుతాడు. మార్గమధ్యంలో ఓ రైల్వే స్టేషన్‌లో అమ్మాయి (రిషికి లొక్రే)ని చూస్తాడు. కానీ ఆమె ఎవరికీ కనిపించదు. కేవలం మాధవ్ కె  కనిపిస్తుంది? అసలు ఆ అమ్మాయికి మాధవకి ఉన్న సంబంధం ఏంటి? ఆరాధ్య అంటూ ఆ అమ్మాయి వెనకాల ఎందుకు వెళ్తాడు? వీరిద్దరి మధ్య ఉన్న గతం ఏంటి? ప్రేమ కోసం ఈ ఇరువురు చేసిన త్యాగాలేంటి? అనేది ఈ సినిమా కథ.

నటీనటుల హావభావాలు:

తేజ్ బొమ్మదేవరకు మొదటి సినిమా అయినా కూడా రెగ్యులర్ గా సినిమాలు చేసే హీరోలా ఎక్కడా కొత్త అనిపించలేదు. ఎంతో నేచురల్‌గా నటించినట్టు అనిపిస్తుంది. ప్రేమికుడిగా, జాలీగా తిరిగే యువకుడిగా, పక్కింటి అబ్బాయిలా కనిపించి మెప్పించాడు. డ్యాన్సులు, డైలాగ్ డెలివరీలో మంచి నటనను కనబర్చాడు. హీరో తేజ్ డాన్స్, ఫైట్స్ చేయటంలొ చాలా కష్ట పడ్డాడు. మంచి నటన కనపరిచాడు ఇక హీరోయిన్‌గా కనిపించిన రిషికి లొక్రే శ్రీదేవి కూతురు ఝాన్వి కపూర్ ని గుర్తు చేస్తుంది. తన నటనతో  అందరినీ ఆకట్టుకుంటుంది. తెరపై ఎంతో చలాకీగా అందంగానూ కనిపించింది. హీరోయిన్ తండ్రిగా కనిపించిన బొమ్మదేవర రామచంద్ర రావు ఎమోషనల్ సీన్లతో ఏడిపిస్తాడు. ఫ్రెండ్స్ పాత్రలు నవ్విస్తాయి.

సాంకేతికవర్గం పనితీరు:

మాధవే మధుసూదన అనే టైటిల్‌లో ఎంత పాజిటివిటీ ఉందో సినిమాలోనూ అంతే పాజిటివిటీ ఉంది. ఎక్కడా వల్గారిటీని చూపించలేదు. అలాంటి సీన్ల జోలికి పోకుండా తనకేం కావాలో అది మాత్రమే తీశాడు దర్శకుడు. ఆ విషయంలో డైరెక్టర్‌ను మెచ్చుకోవాల్సిందే. కథ, కథనాలు ఎలా ఉన్నా కూడా వాటి నుంచి గాడి తప్పకుండా చూసుకున్నాడు. దర్శక, నిర్మాత అయిన బొమ్మదేవర రామచంద్ర రావు తనకు ఇది డ్రీమ్ ప్రాజెక్ట్ అనుకుంటా... ఎంతో అద్భుతమైన కథను తెరపై అందంగా చూపించాడు. మాటలు కొన్ని చోట్ల గుండెల్ని తాకేలా ఉన్నాయి. దేవిశ్రీ ప్రసాద్ వద్ద కీ బోర్డు ప్లేయర్ గా అనుభవం వున్నా వికాస్ బాడిస అందించిన  పాటలు వినడానికి, చూడటానికి బాగున్నాయి.  కెమరామెన్ వాసు విజువల్స్ అందంగా ఉన్నాయి. నిడివి సమస్య కూడా వచ్చినట్టుగా అనిపిస్తుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

విశ్లేషణ:

ప్రేమ అంటే సమస్యలు, సంఘర్షణలు కామన్. కానీ ఆ సమస్యలు, సంఘర్షణలు ఎవరితో.. ఎవరి మధ్య అన్నదే ఇంపార్టెంట్. అక్కడే సినిమా సినిమాకు తేడా ఉంటుంది. అన్ని చిత్రాల్లో ప్రేమ ఉన్నా కూడా.. అన్ని ప్రేమ కథలు ఒకేలా ఉండవు. ఈ సినిమాలో విలన్ అంటూ ప్రత్యేకంగా ఉండడు. విధి విలన్‌గా కనిపిస్తుంది. ప్రేయసికి ఇచ్చిన మాట కోసం ప్రియుడు ఏం చేశాడు? ఏం చేయగలడు.. ప్రియుడు లేకుండా ప్రేయసి ఎలా ఉంటుంది? అనేది చక్కగా చూపించారు.ప్రథమార్దం కాస్త జాలీగా సాగుతుంది. ఎక్కడా బోర్ కొట్టించకుండా నడిపించినట్టు అనిపిస్తుంది. కానీ సెకండాఫ్ మాత్రం కొంచెం నీరసంగా, నిదానంగా సాగినట్టు కనిపిస్తుంది. సెకండాఫ్ కాస్త తగ్గించినా బాగుండేదేమో? ఏది ఎమైనా హార్రర్, థ్రిల్లర్, మూఢ నమ్మకాలతో వస్తున్న రణగొణ ధ్వనుల తో హోరిత్తించే మసాలా సినిమాల మధ్య ఎలాంటి సౌండ్ పొల్యూషన్ లేకుండా ప్రశాంతంగా ఈ సినిమా ఒక్క సారి చూడొచ్చు.  

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :