Radha Spaces ASBL

బాలీవుడ్ లో ల‌క్ ను టెస్ట్ చేసుకుంటున్న మాధ‌వ‌న్

బాలీవుడ్ లో ల‌క్ ను టెస్ట్ చేసుకుంటున్న మాధ‌వ‌న్

త‌మిళ యాక్ట‌ర్ మాధ‌వ‌న్ కు లేడీస్ లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు. చూడ్డానికి సాఫ్ట్ గా క‌నిపించే మాధ‌వ‌న్, స‌ఖి సినిమాతో మొద‌లుపెట్టి త‌న కెరీర్లో చాలా వ‌ర‌కు సాఫ్ట్ సినిమాలే చేసుకుంటూ వ‌చ్చాడు. మొద‌ట్లో మాధ‌వ‌న్ కు ల‌వ‌ర్ బాయ్ ఇమేజ్ ఉండేది. ఆ త‌ర్వాత విభిన్న క్యారెక్ట‌ర్లు చేసి ఆడియ‌న్స్ ను మెప్పించాడు.

యువ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్ట‌ర్ చేసి మంచి మార్కులే కొట్టేశాడు మాధ‌వన్. మొన్నీమ‌ధ్య తెలుగులో నాగ చైత‌న్య హీరోగా వ‌చ్చిన స‌వ్య సాచి సినిమాలో విల‌న్ గా న‌టించి మంచి న‌ట‌న‌ను క‌న‌బ‌రిచాడు. అయితే టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు మాధ‌వ‌న్ ను సాఫ్ట్ గా చూడ‌టం అల‌వాటై విల‌న్ క్యారెక్ట‌ర్లో అత‌న్ని ఊహించుకోలేక‌పోయారు.

ఇప్పుడు మాధ‌వ‌న్ బాలీవుడ్ లో విల‌న్ గా త‌న ల‌క్ ను ప‌రీక్షించుకోబోతున్నాడు. అజ‌య్ దేవ‌గ‌ణ్ హీరోగా  వికాస్ బ‌ల్ ద‌ర్శ‌క‌త్వంలో రాబోతున్న సైతాన్ సినిమాలో మాధ‌వ‌న్ విల‌న్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ఈ సినిమాలో త‌మిళ న‌టి జ్యోతిక హీరోయిన్ గా న‌టిస్తోంది. గ‌తంలో జ్యోతిక‌తో హీరోగా న‌టించిన మాధ‌వ‌న్, ఇప్పుడు సైతాన్ లో విల‌న్ పాత్ర‌లో న‌టించ‌నుండ‌టం విశేషం. మార్చి 8న సైతాన ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :