ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

రివ్యూ : 'మ్యాడ్' గుడ్ ఎంటర్ టైన్ మూవీ

రివ్యూ : 'మ్యాడ్' గుడ్ ఎంటర్ టైన్ మూవీ

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ 3/5 
నిర్మాణ సంస్థలు : సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ 4 సినిమాస్
నటీనటులు: నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, గౌరీ ప్రియ, ఆనంతిక, గోపిక ఉదయన్,
రఘుబాబు, రచ్చ రవి, మురళీధర్ గౌడ్, విష్ణు ఆంటోనీ, శ్రీకాంత్ రెడ్డి తదితరులు
సంగీతం: భీమ్స్, సినిమాటోగ్రఫీ: షామ్ దత్, దినేష్ క్రిష్ణన్  బి
ఆర్ట్: రామ్ అరసవిల్లి, ఫైట్ మాస్టర్: కరుణాకర్
అడిషనల్ స్క్రీన్ ప్లే: ప్రవీణ్ పట్టు, ప్రణయ్ రావు తక్కళ్లపల్లి
ఎడిటర్: నవీన్ నూలి, సమర్పణ: ఎస్. నాగ వంశీ
నిర్మాతలు : హారిక సూర్యదేవర, సాయి సౌజన్య
రచన, దర్శకత్వం: కళ్యాణ్ శంకర్
విడుదల తేదీ :06.10.2023

ఇటీవల టాలీవుడ్ లో యూత్ లో అయితే మంచి బజ్ ని రేపి ఈ రోజు రిలీజ్ అయిన చిత్రం “మ్యాడ్”. జూ. ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా పరిచయం అవుతూ...  నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కుమార్తె హారిక సూర్యదేవర తొలిసారిగా నిర్మాతగా మ్యాడ్ సినిమాతో పరిచయం అయింది. ఇది వరకు హారిక, హాసిని.. సితారా క్రియేషన్స్ బ్యానర్ లలో  ఇది వరకు ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలు వచ్చాయి. ఈ సారి  మ్యాడ్ అనే సినిమాతో ఓ చిన్న ప్రయోగం చేసినట్టు కనిపిస్తోంది. జాతిరత్నాలు స్టైల్లో దర్శకుడు కళ్యాణ్ శంకర్ ఈ చిత్రాన్ని మలిచిన తీరు ప్రెకషకుడిని ఏ మేరకు ఆకట్టుకుందో సమీక్ష లో  చూద్దాం.

కథ:
ఓ ఇంజనీరింగ్ కాలేజ్.. అందులోకి ఫస్ట్ ఇయర్‌లో మనోజ్ (రామ్ నితిన్), అశోక్ (నార్నే నితిన్), దామోదర్ అలియాస్ డీడీ (సంగీత్ శోభన్)లు జాయిన్ అవుతారు. ముగ్గురు కూడా  ఇంజినీరింగ్ కాలేజ్ అండ్ హాస్టల్ మేట్స్  వీరితో పాటుగా లడ్డు అనే కుర్రాడు కూడా వస్తాడు. మనోజ్ కనిపించిన ప్రతీ అమ్మాయితో పులిహోర కలుపుతుంటాడు. అశోక్ తన పని తాను అన్నట్టుగా ఉంటాడు. ఇక డీడీ అయితే తనకు అమ్మాయిలు సూట్ అవ్వరు అని అనుకుంటూ ఉంటాడు. సింగిల్ లైఫ్ బెటర్ అన్నట్టుగా ఉంటాడు. ఇక మనోజ్ ఓ సారి బస్సులో  శ్రుతిని చూసి  ఇష్టపడతాడు. మరో వైపు కాలేజ్‌లో అశోక్‌ను జెన్నీ ఇష్టపడుతుంటుంది.. అశోక్ సైతం జెన్నీని ఇష్టడుతుంటాడు. కానీ పైకి చెప్పుకోరు. తనను ఎవ్వరూ ఇష్టపడరు అని అనుకుంటున్న డీడీ లైఫ్‌లోకి ఓ ప్రేమ లేఖ వస్తుంది? ఆ లెటర్ రాసింది ఎవరు? ఈ ముగ్గురి ప్రేమ కథలు ఎలా ముగిశాయి? అసలు కాలేజ్‌లో ఆ మిత్రత్రయం మ్యాడ్‌గా మారి చేసిన పనులేంటి? చివరకు ప్రేమ కథలు సఫలమయ్యాయా? అన్నదే మిగతా కథ.

నటీనటుల హావభావాలు:
నార్నే నితిన్ యాక్షన్ సీక్వెన్స్, డ్యాన్సులు బాగానే చేశాడు. సంగీత్ శోభన్ మరోసారి కామెడీ టైమింగ్‌తో రఫ్పాడించేశాడు. అశోక్ పాత్రలో హీరోయిజం, క్యారెక్టర్  ఎలివేషన్లు బాగా కనిపిస్తాయి. ఇక  హీరోయిన్లు ముగ్గురూ కూడా అందంగా కనిపిస్తారు.. అందర్నీ నటనతో మెప్పిస్తారు. ప్రిన్సిపాల్‌గా రఘుబాబు, స్టూడెంట్లుగా కనిపించిన ఇతర కుర్రాళ్లు, సీనియర్లుగా కనిపించిన రెండు మూడు కారెక్టర్లు.. ఇలా మిగతా పాత్రలన్నీ కూడా నవ్వించేందుకు ఉంటాయి. అయితే ఎక్కువగా డీడీ, లడ్డు పాత్రలు జనాలకు గుర్తుండిపోయేలా వున్నాయి.

సాంకేతికవర్గం పనితీరు :
దర్శకుడు కళ్యాణ్ శంకర్ విషయానికి వస్తే.. తాను కొత్త కథ, కథాంశాలు ఏమి ఎంచుకోలేదు కానీ యూత్ కి కావాల్సిన ఓ ఎంటర్టైనర్ ని ఇవ్వడంలో మాత్రం సక్సెస్ అయ్యారు అని చెప్పొచ్చు.  సినిమాను పూర్తి వినోదాత్మకంగా తీయాలని దర్శకుడు ఫిక్స్ అయ్యాడు. అందుకే కష్టాలు, బాధలు అని ప్రేక్షకుడిని ఏడ్పించొద్దని ఫిక్స్ అయినట్టున్నాడు. సినిమాను ఆసాంతం వినోదాత్మకంగా తీర్చి దిద్దాడు. చాలా చోట్ల మాటలు నవ్విస్తాయి. భీమ్స్ మ్యూజిక్ బాగుంది. తన మార్క్ ఫోక్ సాంగ్స్ యూత్ సాంగ్స్ ఆకట్టుకుంటాయి.  ప్రేక్షకుల చేత కూడా డ్యాన్స్ వేసేలా చేయిస్తాయి. కెమెరా పనితనం, ఆర్ట్ డిపార్ట్మెంట్, ఎడిటింగ్ టీం పని తీరు బాగుంది. మేకర్స్ పెట్టిన నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని తెరకెక్కించి అందించారు.  
   
విశ్లేషణ:
కాలేజ్ అంటే ఇట్లా ఉంటదా?.. ఎప్పుడూ తాగుడు తందనాలు, అమ్మాయిలేనా ? అని అనుకుంటే మాత్రం ఈ సినిమాను ఎంజాయ్ చేయలేరు.. ఇంట్లో తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తే కుర్రాళ్ళు  వేసే వేషాలు ఇలాంటివా? అనుకుంటే..కుర్రాళ్ళలు ఇలా చదువుకోకుండా వెకిలి వేషాలు  వేస్తుంటే  తల్లిదండ్రులు ఏమీ అనరా? అని లాజిక్ ఆలోచిస్తే మాత్రం ఈ సినిమాలో వున్న ఆ కామెడీని ఎంజాయ్ చేయలేరు. కాలేజ్, హాస్టల్ లైఫ్‌లంటే ఇట్లనే ఉంటాయని డైరెక్టర్ ఎంతో ఫన్నీగా చూపించాడు. లాజిక్‌లు వెతక్కుండా అలా థియేటర్లో కూర్చుంటే మాత్రం రెండు గంటల సేపు కడుపుబ్బా, గొంతు నొప్పి పుట్టేలా నవ్విస్తాడు దర్శకుడు. అలా నవ్విస్తారు ఆ మిత్రతయం.. వారితో పాటు లడ్డు పాత్రధారి కూడ . మ్యాడ్‌లో మాత్రం మరీ అంత సిల్లీగా అనిపించే సీన్లు ఉండవు.. జాలీగా కథ, కథనం సాగుతుంది. కాలేజ్, హాస్టల్ లైఫ్ గడిపిన ప్రతీ ఒక్కరూ ఒక్కసారి తమ రోజుల్ని గుర్తు చేసుకుంటారు. నవ్వుకుంటారు. రొటీన్ కథాంశం, కొన్ని సీన్స్ పక్కన పెడితే ఈ చిత్రం ఈ వారంతానికి ఫుల్ అఫ్ ఫన్ గా ఎంటర్ టైన్ చేస్తుంది. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :