ASBL NSL Infratech

మచిలీపట్నం వాలంటీర్ ల ముకుమ్మడి రాజీనామా..

మచిలీపట్నం వాలంటీర్ ల ముకుమ్మడి రాజీనామా..

ఏపీ రాజకీయాలలో ఇప్పుడు వాలంటీర్ల సమస్య పెద్ద చర్చకు దారితీస్తోంది. ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో పెన్షన్లతో పాటు, రేషన్ పంపిణీ లాంటి విషయాల్లో కూడా వాలంటీర్ల పై ఆంక్షలు విధించారు. అంతేకాకుండా వారికి ప్రభుత్వం ఇచ్చిన సెల్ ఫోన్స్, టాబ్స్ కలెక్టర్ కు స్వాధీనం చేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ప్రస్తుతం వాలంటీర్లు వరుసగా రాజీనామాలు చేయడం ఈ విషయాన్ని మరింత జటిలం చేస్తోంది. మరీ ముఖ్యంగా మచిలీపట్నానికి చెందిన వాలంటీర్లు చాలామంది రాజీనామా సమర్పించారు. మున్సిపల్ కమిషనర్ కు, గ్రామ సచివాలయం లో అందరూ తమ రాజీనామాలు అందిస్తున్నారు. ఒక్క మచిలీపట్నం నియోజకవర్గంలో 1200 మంది వాలంటీర్లు ఉన్నారు. వీరంతా ఇప్పుడు ముకుమ్మడిగా రాజీనామా చేశారు. ఇక రాజీనామా తో పాటు వారు తమ ఆవేదనను కూడా వ్యక్తం చేశారు. 50 నెలల పాటు ఎటువంటి రాజకీయ పక్షపాతం లేకుండా నిస్వార్ధంగా సేవలు అందించామని.. అయితే కొందరు సొంత లాభం కోసం తమకు రాజకీయాలు ఆపాదించాలని.. మనస్థాపం చెంది తాము ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వారు తమ రాజీనామాతో పాటు ఓ లేఖ లో తెలియపరచారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :