లండన్ లో బోనాల జాతర... పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ ఆధ్వర్యంలో జూన్ 25న బ్రిటన్ రాజధాని లండన్‌లో బోనాల జాతర జరుగనుంది. వెస్ట్ లండన్‌లోని సయన్ స్కూల్ ఆడిటోరియంలో నిర్వహించనున్న లండన్ బోనాల జాతర పోస్టర్‌ను ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పండుగను ఖండాంతరాల్లో ఘనంగా నిర్వహించడమే కాకుండా, మన సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పడానికి టాక్ సంస్థ చేస్తున్న కృషిని కవిత అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌డీసీ చైర్మన్, టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలంతో పాటు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు.







Tags :