ASBL NSL Infratech

మెగా157కు లైన్ క్లియ‌ర్

మెగా157కు లైన్ క్లియ‌ర్

భోళా శంక‌ర్ త‌ర్వాత చిరంజీవి తర్వాతి సినిమాను మొద‌లుపెట్టడానికి చాలానే టైమ్ తీసుకున్నాడు. మెగా156,157 సినిమాల‌కు సంబంధించి ఒకేసారి అనౌన్స్మెంట్ వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ముందు అనుకున్న ప్ర‌కారమైతే వ‌శిష్ట తో చేస్తున్నది మెగా157. అది కాకుండా మ‌రో డైరెక్ట‌ర్ తో మెగా156ను అనౌన్స్ చేశారు. కానీ క‌థ విష‌యంలో క్లారిటీ లేక చిరూ ముందుగా వ‌శిష్ట సినిమాను ప‌ట్టాలెక్కించాడు. క్ర‌మంగా అదే మెగా156 అయింది.

ఆ త‌ర్వాత మెగా 157 గురించి కొన్ని నెల‌ల పాటూ ర‌క‌ర‌కాల వార్త‌లొచ్చాయి. ఈ సినిమాను చిరంజీవి కూతురు సుస్మిత నిర్మించాల‌ని అనుకోవ‌డంతో మంచి కంటెంట్ తో ముందుకు రావాల‌నుకున్నారు. అప్ప‌ట్నుంచి ఈ సినిమాకు డైరెక్ట‌ర్లుగా ప‌లువురు పేర్లు తెర‌పైకి వ‌చ్చాయి. కానీ ఆఖ‌రికి హ‌రీష్ శంక‌ర్ పేరును లాక్ చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. హరీష్ చెప్పిన లైన్ బాగా న‌చ్చ‌డంతో చిరూ వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు అన్నారు.

తాజా స‌మాచారం ప్ర‌కారం, మెగా 157 ఖాయ‌మైన‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు డైరెక్ట‌ర్ గా హరీష్ శంక‌ర్ లాక్ అయిన‌ట్లు మెగా కాంపౌండ్ వ‌ర్గాలంటున్నాయి. ప్ర‌స్తుతం ర‌వితేజ‌తో మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ చేస్తున్న హ‌రీష్ శంక‌ర్ ఆ సినిమా షూటింగ్ ను వేగంగా పూర్తి చేయ‌డానికి కారణం ఇదేనట‌. జులైలో మెగా157 ను స్టార్ట్ చేయాల‌ని ఇప్ప‌టికే ముహూర్తం కూడా పెట్టేశార‌ని తెలుస్తోంది. జులై నుంచి చిరూ విశ్వంభ‌ర‌తో పాటూ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన‌నున్నాడ‌ట‌. అవ‌స‌ర‌మైతే రెండు సినిమాల సెట్స్ ఒకే ద‌గ్గ‌ర వేసేలా కూడా ప్లాన్స్ చేస్తున్నార‌ట‌.  

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :