ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

లక్ష్మి లాజిస్టిక్స్ తో లాజిస్టిక్స్ రంగంలోకి ప్రవేశించిన లక్ష్మీ నివాస్ డెవలపర్స్

లక్ష్మి లాజిస్టిక్స్ తో లాజిస్టిక్స్ రంగంలోకి ప్రవేశించిన లక్ష్మీ నివాస్ డెవలపర్స్

భారతదేశవ్యాప్తంగా లాజిస్టిక్స్ పార్కుల ప్రకటన – చిత్తూరు (ఆంధ్రప్రదేశ్), సదాశివపేట – తెలంగాణ & లక్నో (యూపీ)
రూ.5.24 లక్షల కనీస పెట్టుబడిపై 8-12% పెట్టుబడి ప్రతిఫలం
తాము చురుగ్గా లేని సమయంలో సైతం తమ డబ్బు పని చేసేలా ప్రాజెక్టుల్లో ఇబ్బంది రహిత పెట్టుబడులు కోరుకునే వారి కోసం అత్యుత్తమ ఎంపిక.
 
భారతదేశ వ్యాప్తంగా లక్ష్మి లాజిస్టిక్స్ పార్క్స్ నెలకొల్పనున్నట్లు హైదరా బాద్ కు చెందిన రియల్ ఎస్టేట్ డెవలపర్ లక్ష్మీ నివాసం డెవలపర్స్ ప్రకటించింది. మొదటగా ఇవి చిత్తూ రు, సదాశివపేట, లఖ్ నవూ లలో ప్రారంభం కానున్నాయి. వేర్ హౌసింగ్, లాజిస్టిక్స్ రంగాల్లోకి ఈ బ్రాండ్ ప్రవేశాన్ని ఇది సూచిస్తోంది.  

లక్ష్మి లాజిస్టిక్స్ పార్క్ 30 ఎకరాల స్థలంలో 6.75 లక్షల చ.అ.ల వేర్ హౌసింగ్ స్పేస్ ను నిర్మించ నుంది. సుమారుగా రూ.150 కోట్ల పెట్టుబడితో నిర్మాణం కానుంది. ఆయా నగరాలు, పరిసరాల్లో ఇవి 1200 ఉపాధి అవకాశాలను అందించనున్నాయి.

దేశవ్యాప్తంగా ఫ్లిప్ కార్ట్, అమెజాన్, పి అండ్ జి వంటి ప్రముఖ కంపెనీలు అన్నింటికీ లక్ష్మి లాజిస్టిక్స్ పా ర్క్ అనేది వన్ స్టాప్ షాప్ కానుంది.

అంతేగాకుండా క్రమం తప్పని అదనపు ఆదాయం కోరుకునే వారి కోసం ఈ కంపెనీ పెట్టుబడిదారు లకు అత్యుత్తమ ఆప్షన్ ను కూడా అందిస్తోంది. రూ.5.24 లక్షల పెట్టుబడితో లాజిస్టిక్స్ పార్క్ లో 40 చ.గ. స్థలం కొనుగోలు చేసే వారికి పెట్టుబడిపై ప్రతిఫలం (ఆర్ఒఐ) గా 8-12 శాతం నెలవారీ అద్దె ఆదాయాన్ని అందిస్తోంది.
ఈ సందర్భంగా లక్ష్మీ నివాసం డెవలపర్స్ చైర్మన్, వ్యవస్థాపకులు రాజేంద్ర ప్రసాద్ సముందర్ పల్లి మాట్లా డుతూ, ‘‘లక్ష్మి లాజిస్టిక్స్ పార్క్ ను ప్రారంభిస్తున్నందుకు మేమెంతగానో సంతోషిస్తున్నాం. సాధారణ వ్యక్తులకు పెట్టుబడి రూపాలను ఈ వెంచర్ మార్చివేయనుంది. 2035 నాటికి ఒక మిలి యన్ మిలియ నీర్లను చేసేందుకు ఇది ఒక అడుగు దూరంలోనే ఉంది. ఇది అతిపెద్ద లాజిస్టిక్ స్పేసె స్ లో ఒకటి కావాలని, మా కంపెనీలో సాధారణ వ్యక్తులు సైతం యజమానిగా ఉండాలనే ఆలోచ నతో మేం నెలవారీ అద్దె ఆదాయాలను అందించడాన్ని ప్రారంభించాం. మా ప్రాపర్టీలు ఎంతో విలాసం గా ఉన్నప్పటికీ, ప్రతీ ఒక్కరికీ అందుబాటులోనూ ఉంటాయి. దీన్ని దేశవ్యాప్తంగా విస్తృతంగా ముం దుకు తీసుకెళ్లనున్నాం’’ అని అన్నారు.

ఉత్తరప్రదేశ్ లోని లఖ్ నవూ లో మరో లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు ద్వారా ఈ కంపెనీ దేశవ్యాప్తంగా కొ న్ని ప్రాజెక్టులను తీసుకురానుంది. జైపూర్, వారణాసి, కాంబోడియా, చిక్ మంగళూరులలో హో టల్స్, రిసార్ట్స్ వంటి ప్రణాళికలున్నాయి. ఇటీవలే ఇది యాదాద్రిలో 400-కీస్ ప్రాజెక్ట్ ను చేపట్టింది. మొదటి దశలో 140 కీస్ ను పూర్తి చేసింది.

హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం శరవేగంగా వృద్ధి చెందుతోంది. రియల్టర్లు అందరికీ ఇది ఒక రోల్ మోడల్ సిటీగా కూడా ఉంది. యువ మదుపరులు తక్కువ పరిమాణం డబ్బు వెచ్చింపుతో ఉండే చక్కటి క్రమం తప్పని ఆదాయ వనరు కోసం చూస్తున్నారు. ఐటీ, ప్రభుత్వ రంగాలు వంటి వాటితో పోలిస్తే, రియల్ ఎస్టేట్ ఎప్పటికీ విజయం అందించే సురక్షితమైన వనరుగా ఉంటుంది. సం పద సృష్టించేందుకు గొప్ప వనరుగా ఉంటుంది.

లక్ష్మీనివాసం డెవలపర్స్ పరిశ్రమలో పదేళ్లుగా తన సేవలను అందిస్తోంది. మరింకెన్నో సేవలను అందించాలని భావిస్తోంది. సంస్థ ప్రాజెక్టులు రెండు తె లుగు రాష్ట్రాల నుంచి కూడా కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :