ASBL NSL Infratech

కొండా సురేఖ క్షమాపణలు చెప్పాలి.. లేదంటే..: కేటీఆర్

కొండా సురేఖ క్షమాపణలు చెప్పాలి.. లేదంటే..: కేటీఆర్

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనపై తప్పుడు ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు పంపిస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేటీఆర్ ఆదేశాలతోనే తమ ఫోన్‌లను ట్యాపింగ్ చేశారంటూ మంత్రి కొండా సురేఖ, కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డిలతో పాటు ఆ పార్టీ నేత కేకే మహేందర్ రెడ్డి చేసిన ఆరోపణలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఈ క్రమంలోనే తనపై వస్తున్న ఆరోపణలను ఖండించిన కేటీఆర్‌ ‘ఎక్స్‌’ వేదికగా సదరు నేతలపై మండిపడ్డారు. తనపై నిరాధారమైన, తప్పుడు ఆరోపణలు చేస్తున్న నేతలు వెంటనే క్షమాపణ చెప్పాలని, లేకపోతే మంత్రితో పాటు ఇద్దరు నేతలు లీగల్ నోటీసులు, పరువు నష్టం దావాలు ఎదుర్కోవాల్సి హెచ్చరించారు. ‘‘నాపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన ఇద్దరు కాంగ్రెస్ నేతలు, మంత్రి కొండా సురేఖ పై కోర్టుకు వెళ్తా.. న్యాయపరంగా నాపై చేస్తున్న అబద్ధపు ఆరోపణలు ఎదుర్కొంటా’’ అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.

ఇదిలా ఉంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విచారణ వేగవంతమైన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే ఎస్‌ఐబీ డీఎస్పీ ప్రణీత్‌రావు, మరో ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులు భుజంగరావు, తిరుపతన్నను అరెస్ట్ అయ్యారు. ప్రణీత్ రావు, మాజీ అధికారి రాధాకిషన్‌ రావును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ టి.ప్రభాకర్‌రావు ఏ1 నిందితుడిగా ఉన్నారు. ప్రభాకర్‌రావు ఆదేశాలతోనే ప్రణీత్‌రావు ఫోన్ ట్యాపింగ్ హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేసినట్లు విచారణలో నిర్ధారణయ్యింది. ప్రస్తుతం ఆ హార్డ్ డిస్క్‌లను రికవరీ చేసిన పోలీసులు.. సమాచారాన్ని రిట్రీవ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా.. ఈ వ్యవహారంలో తనపై కేసు నమోదైందని తెలిసిన వెంటనే ప్రభాకర్‌రావు అమెరికా వెళ్లిపోయారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :