ASBL NSL Infratech

వచ్చే ఎన్నికల్లో 90 నుంచి 100 స్థానాల్లో... మరోసారి కేసీఆరే

వచ్చే ఎన్నికల్లో 90 నుంచి 100 స్థానాల్లో... మరోసారి కేసీఆరే

తెలంగాణ రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ తిరిగి అధికారంలోకి వస్తుందని, 90 నుంచి 100 స్థానాల్లో సునాయాసంగా గెలుస్తుందని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో మంత్రి మీడియాతో మాట్లాడుతూ మరోసారి కేసీఆర్‌ ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌ తమ సీఎం అభ్యర్థి ఎవరో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎంఐఎం ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందనేది ఆ పార్టీ ఇష్టం. ప్రజలు మతం ప్రాతిపదికనే ఓట్లు వేస్తారని నేను నమ్మను. ఎంఐఎం కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌కు మాత్రమే ఓట్లేసారనేది కాదు. ప్రజలు మంచి ప్రభుత్వాన్ని ఎంచుకుంటారని నమ్ముతున్నా అని అన్నారు.

నీళ్లు, నిధులు, నియామకాల స్ఫూర్తితో పనిచేసి బీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. తొమ్మిదేళ్లలో తెలంగాణ సమగ్ర, సమతుల, సమ్మిళిత అభివృద్ధిని సాధించింది. పరిపాలన సంస్కరణలు దేశంలో ఎక్కడ లేనంతా వేగంగా జరుగుతున్నాయి. ప్రతి పక్షాలకు పనిలేక తొమ్మిదేళ్లుగా అస్యత ఆరోపణలు చేస్తున్నారు. విపక్షాలు హేతుబద్ధంగా, రుజువులతో మాట్లాడలేక పోయాయి. చేతిలో ఉన్న రూపాయిని పారేసి చిల్లర ఏరుకోవద్దని  ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. చిల్లర రాజకీయాలు చేసే నాయకులను ప్రజలు పట్టించుకోరన్న విశ్వాసం నాకుంది. బీజేపీ, కాంగ్రెస్‌ నేతలకు ధైర్యముంటే తెలంగాణ కన్నా మంచి మోడల్‌ చూపించాలి. కాంగ్రెస్‌, బీజేపీ 75 ఏళ్లు చేయని పనిని తొమ్మిదేళ్లలో చేసి చూపిస్తున్నాం. కాంగ్రెస్‌ బీజేపీ పరిపాలన కొత్త సీసాలో పాత సారాలా ఉంటుంది అని ఆన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :