ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ప్రభాస్, కృతి సనన్ ఎంగేజ్మెంట్ ఫిక్స్!? వైరల్ అవుతున్న ట్వీట్...

ప్రభాస్, కృతి సనన్ ఎంగేజ్మెంట్ ఫిక్స్!? వైరల్ అవుతున్న ట్వీట్...

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సినిమాలకంటే ఎక్కువ తన పెళ్లి టాపిక్ తోనే వార్తల్లో నిలుస్తున్నాడు. ఈ మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ పెళ్లి కోసం ఫాన్స్ గత కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారన్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు తన వివాహ విషయాన్ని వాయిదా వేస్తూ సినిమాలతో బిజీగా గడిపేస్తున్నాడు ఈ బాహుబలి హీరో. మిర్చి సినిమా షూటింగ్ టైం నుండే ప్రభాస్ అనుష్క లవ్ లో ఉన్నారు, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ రూమర్స్ వచ్చాయి. తర్వాత ఇటు ప్రభాస్, అటు అనుష్క కూడా స్పందించి తాము మంచి ఫ్రెండ్స్ అంటూ క్లారిటీ ఇచ్చారు. 

ఇక్కడితో ఆగకుండా ఈ హీరో పెళ్లి పై రీసెంట్ గా మరొక వార్త నెట్టింట హల్చల్ చేసింది. ప్రభాస్ ప్రస్తుతం ఆదిపురుష్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా హీరోయిన్ కృతి సనన్ తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నాడని సినీ ఇండస్ట్రీలో  గుసగుసలు వినిపించాయి. బాలీవుడ్ లో సైతం కృతి సనన్ ని ఉదేశిస్తూ హీరో వరుణ్ ధావన్ చేసిన కామెంట్స్ ఈ వార్తకి మరింత బలాన్ని చేకూర్చాయి. కృత్తి మనసులో ఒక హీరో ఉన్నాడు, అతను ఇప్పుడు ఇక్కడ లేదు హైదరాబాద్ లో ఉన్నాడంటూ పెద్ద దుమారమే లేపాడు వరుణ్ ధావన్.

తాజాగా వీరిరువురి గురించి ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సందు సోషల్ మీడియా వేదికగా ఒక ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ కొన్ని సెకండ్స్ లో వైరల్ అవ్వడం విశేషం. ప్రెజెంట్ నెట్టింట ఒక రేంజ్ లో ఈ ట్వీట్ చక్కర్లు కొడ్తుంది. పాన్ ఇండియా హీరో ప్రభాస్, ముద్దుగుమ్మ కృతి సనన్ నిశ్చితార్థం డేట్ ఫిక్స్ అయింది. మాల్దీవ్స్ లో ఈ జంట ఒకటి కాబోతున్నారంటూ ఉమైర్ సందు ట్వీట్ చేశారు. గతం లో కూడా ఈ క్రిటిక్ పలువురి సెలెబ్రెటీస్ పై అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేకుండా ట్వీట్లు చేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కున్న విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలో నిజం ఎంత ఉందో అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ వార్త నిజమైతే బాగుండు అని ప్రభాస్ ఫాన్స్ కోరుకుంటున్నారు. ప్రభాస్ ఒక ఇంటి వాడైతే చూడడానికి ఇటు అభిమానులు అటు ప్రేక్షకులు రెడీ గా ఉన్నారు. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :