ASBL NSL Infratech

నేను హోంమంత్రి అయితేనే... వాళ్లు కంట్రోల్ లో

నేను హోంమంత్రి అయితేనే... వాళ్లు కంట్రోల్ లో

నేను హోంమంత్రి అయితేనే బీఆర్‌ఎస్‌ నేతలు కంట్రోల్‌లో ఉంటారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి తెలిపారు. శాసనసభ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని తెలిపారు. తనకు అధిష్ఠానం హామీ ఇచ్చిందని, హోంశాఖ ఇవ్వాలని కోరుతున్నానని తెలిపారు. కేసీఆర్‌ను గద్దె దించేందుకే కాంగ్రెస్‌లోకి వచ్చా. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు, కవిత, సంతోష్‌ రావు, జగదీశ్‌ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయం. భువనగిరి, నల్గొండ లోక్‌సభ స్థానాల్లో మా కుటుంబ సభ్యులెవరూ పోటీ చేయకూడదనేని మా ఆలోచన. పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తాం. ఎవరికి టికెట్‌ ఇచ్చిన గెలిపిస్తాం అని అన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :