Radha Spaces ASBL

బంప‌రాఫ‌ర్ కొట్టేసిన కియారా

బంప‌రాఫ‌ర్ కొట్టేసిన కియారా

భ‌ర‌త్ అనే నేను సినిమాతో టాలీవుడ్ కు ప‌రిచ‌యమైన కియారా అద్వానీ ప్ర‌స్తుతం గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న గేమ్ ఛేంజ‌ర్ అనే సినిమాలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఇప్పుడు కియారా కు ఓ బంపరాఫ‌ర్ ద‌క్కిన‌ట్లు తెలుస్తోంది. ర‌ణ‌వీర్ సింగ్ హీరోగా తెర‌కెక్క‌నున్న డాన్3 సినిమాలో కియారా హీరోయిన్ గా ఎంపికైన‌ట్లు తెలుస్తోంది.

డాన్ సినిమాతో ఇప్ప‌టికే షారుఖ్ త‌న‌దైన ముద్ర వేసుకున్నాడు. ఇప్పుడు ఆ ఫ్రాంచైజీలో ర‌ణ‌వీర్ సింగ్ మూవీ చేయ‌బోతున్నాడు. ఫ‌ర్హాన్ అక్త‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న డాన్ 3 సినిమాలో ర‌ణ‌వీర్ సింగ్ కు జోడీగా కియారా అద్వానీ ఎంపికైన‌ట్లు అఫీషియ‌ల్ గా అనౌన్స్మెంట్ వ‌చ్చింది. శంక‌ర్ ఎహ‌సాన్ లాయ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఎన్నో అంచ‌నాల మధ్య తెర‌కెక్కుతుంది.

ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ జ‌రుపుకుంటున్న డాన్3 సినిమాను వ‌చ్చే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. గ‌తంలో ఈ ఫ్రాంచైజ్ లో వ‌చ్చిన సినిమాకు ఏ మాత్రం తీసిపోకుండా డాన్3ను తెర‌కెక్కించ‌నున్న‌ట్లు మేక‌ర్స్ న‌మ్మ‌కంగా చెప్తున్నారు. ఇలాంటి సినిమాలో కియారా ఛాన్స్ కొట్టేసిందంటే అమ్మ‌డుకి బంపరాఫ‌ర్ ద‌క్కింద‌నే చెప్పాలి.  

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :