మహాపూజలతో నాగోబా జాతర ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో కొలువుదీరిన ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతర ప్రారంభమైంది. ఉదయం మర్రి చెట్ల వద్ద, పీఠాధిపతి మెస్రం వెంకట్‌రావు ఆధ్వర్యంలో నాగోబా గుడి (మురాడి) వద్ద ప్రత్యేక పూజలు చేశారు. నాగోబా విగ్రహాన్ని నాయక్‌వాడి మెస్రం ధర్ము తలపై ఎత్తుకొని ఆలయానికి చేరుకున్నారు. మహిళలు కోనేరు నుంచి మట్టి కుండల్లో తీసుకొచ్చిన నీటితో ఆలయ ప్రాంగణంలో పుట్టలను తయారు చేశారు. ఇలా వివిధ కార్యక్రమాల అనంతరం రాత్రి మహాపూజలతో జాతరను ప్రారంభించారు. వేల సంఖ్యలో భక్తులు హాజరవ్వగా, పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Tags :