కేశినేని నాని సంచలన నిర్ణయం.. రాజకీయాలకు
సార్వత్రిక ఎన్నికలకు ముందు జగన్ పంచన చేరి ఓటమిపాలైన విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని రాజకీయ సన్యాసం తీసుకున్నారు. తన రాజకీయ ప్రయాణాన్ని ముగించినట్లు ఆయన ప్రకటించారు. జాగ్రత్తగా ఆలోచించాకే రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు పేర్నొన్నారు. రెండుసార్లు ఎంపీగా విజయవాడ ప్రజలకు సేవ చేయడం అపురూపమైన గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. రాజకీయాలకు దూరంగా ఉన్నా విజయవాడ అభివృద్ధికి మద్దతూ ఇస్తూనే ఉంటానన్నారు. తన రాజకీయ ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ అభివృద్ధికి కృషి చేస్తున్న కొత్త ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు.
Tags :