ASBL Koncept Ambience
facebook whatsapp X

ర‌ష్మిక‌ను ఫాలో అవుతున్న కీర్తి

ర‌ష్మిక‌ను ఫాలో అవుతున్న కీర్తి

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ర‌ష్మిక ఆ క్రేజ్ తో బాలీవుడ్ లో కూడా ఛాన్సులందుకుంది. అయితే అక్క‌డ ర‌ష్మిక చేసిన మొద‌టి రెండు సినిమాలు మాత్రం అనుకున్న స్థాయిలో స‌క్సెస్ కాలేదు. కానీ యానిమ‌ల్ సినిమా ర‌ష్మిక కు మంచి స‌క్సెస్ ను ఇచ్చింది. ఈ సినిమా త‌ర్వాత ర‌ష్మిక‌కు బాలీవుడ్ నుంచి మంచి మంచి అవ‌కాశాలొస్తున్న‌ట్లు తెలుస్తోంది.

మ‌రికొన్నాళ్లు ర‌ష్మిక బాలీవుడ్ లో రాణించ‌నుంది. అయితే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వెళ్లిన అంద‌రికీ అక్క‌డ స్టార్ స్టేట‌స్ ద‌క్క‌లేదు. కానీ ర‌ష్మిక మాత్రం ఇటు సౌత్ లోనూ అటు నార్త్ లోనూ మంచి క్రేజ్ తో కెరీర్లో దూసుకెళ్తుంది. ఇప్పుడు ర‌ష్మిక‌ను చూసి మ‌రికొంత‌మంది హీరోయిన్లు ఆమె బాట‌లోనే వెళ్తున్నారు.  మ‌హాన‌టితో సూప‌ర్ క్రేజ్ అందుకున్న కీర్తి సురేష్ కూడా సౌత్ నుంచి నార్త్ కు షిఫ్ట్ అయింది. బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కీర్తి, దాంతో పాటూ మ‌రో రెండు ఛాన్సులందుకున్న‌ట్లు తెలుస్తోంది. అంతేకాదు బాలీవుడ్ కు వెళ్ల‌గానే కీర్తి గ్లామ‌ర్ విష‌యంలో ఉన్న లిమిట్స్ ను చెరిపేస్తుందంటున్నారు. మ‌రి ర‌ష్మిక లానే కీర్తి కూడా సౌత్ నుంచి వెళ్లి బాలీవుడ్ లో స‌క్సెస్ అవుతుందా లేదా అనేది చూడాలి. కీర్తి కూడా ఇటు సౌత్, అటు నార్త్ సినిమాల‌పై త‌న ఫోక‌స్ ను పెట్టింది.  

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :