టాలీవుడ్‌కు దూరమవుతున్న మహానటి?

ఎన్నో ఆశలతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది మల్లూవుడ్ బ్యూటీ కీర్తి సురేష్. అనుకున్నట్లు తనకు అవకాశాలు కూడా బాగానే వచ్చాయి. మహానటి లాంటి సినిమాలో ఛాన్స్ కొట్టేసి తానేంటో దేశ వ్యాప్తంగా నిరూపించుకుంది. మహానటి తర్వాత ఛాన్సులు విపరీతంగా వస్తాయనుకుంటే, అనుకున్న రేంజ్ లో ఛాన్స్ లు రాలేదు.
తానొకటనుకుంటే దైవం మరోలా తలచిందన్నట్లు మహానటి సినిమా తర్వా కీర్తి స్టార్ హీరోలతో ఛాన్స్ ల కోసం చాలానే కష్టపడింది. ఆఖరికి సర్కారు వారి పాటలో మహేష్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినప్పటికీ అవేమీ పెద్దగా కీర్తికి కలిసిరాలేదు. రీసెంట్ గా గ్లామర్ రోల్స్ చేయడానికి కీర్తి సిద్దమైనప్పటికీ టాలీవుడ్ మాత్రం ఈమెను పట్టించుకోవడం మానేసింది.
ప్రస్తుతం కీర్తి చేతిలో భోళా శంకర్ సినిమా ఒక్కటే ఉంది. ఇందులో కూడా కీర్తి హీరోయిన్ కాదు. చిరంజీవికి చెల్లి పాత్రలో కనిపించబోతుంది. ఎంత స్టార్ హీరో సినిమాలో హీరోకు చెల్లి అయినా సరే హీరోయిన్ తో సమానం కాదు. కీర్తి చెల్లి పాత్రలో ఒప్పుకోవడంతో ఇప్పుడు ఆమె గ్రాఫ్ పడిపోయిందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
దీంతో కీర్తి ఇప్పుడు తమిళ, మలయాళ, కన్నడ ఇండస్ట్రీలపై ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తమిళంలో ఐదారు సినిమాలు చేస్తుంది కీర్తి. దీంతో కీర్తి ఇక టాలీవుడ్ కు దూరమవుతుందా అని ఫ్యాన్స్ నిరాశ పడుతున్నారు. కానీ కీర్తి మాత్రం పాత్ర నచ్చితే ఏ అవకాశమొచ్చినా వదులుకోకుండా చేస్తానని చెప్తోంది.






