కవిత అరెస్ట్ వెనుక కారణం అదే.. కేసీఆర్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీబీఐ, ఈడీ చేతిలో బుక్ ఆయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్నారు. ఆమె అరెస్ట్ అనంతరం ఇప్పటి వరకు స్పందించని కేసీఆర్ మొదటిసారిగా అరెస్ట్ గురించి మాట్లాడారు. రీసెంట్ గా తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీ నేతలు అనుసరించాల్సిన వ్యూహాల గురించి పార్టీ కీలక నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన అరెస్ట్ అనంతరం తొలిసారి కవిత గురించి ప్రస్తావించారు. బీజేపీ చాలాసార్లు తమ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నించిందని.. అయితే ఆ విషయాన్ని ముందుగానే పసిగట్టి అడ్డుకున్నామని అన్నారు. ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన బీజేపీ నేత బీఎల్ సంతోశ్ పై అరెస్టు చేయడానికి ప్రయత్నించిన కారణంగా ఇప్పుడు తన కూతురు కవితను అరెస్ట్ చేశారని కేసీఆర్ అన్నారు. తమపై కక్ష కట్టిన బీజేపీ ప్రభుత్వం తన కూతురిని అక్రమ కేసుల్లో ఇరికించి అరెస్ట్ చేశారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.