లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఎన్ని సీట్లొస్తాయో తేల్చి చెప్పిన కేసీఆర్
లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎన్ని ఎంపీ సీట్లు గెలవబోతోందో ఆ పార్టీ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తేల్చి చెప్పేశారు. గురువారం తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని, దానిని పార్టీకి అనుకూలంగా మల్చుకోవాలని నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని, ఈ నెల 22వ తేదీ నుంచి రోడ్ షోలు ప్రారంభమౌతాయని, త్వరలో బస్సుయాత్ర కూడా చేద్దామని అన్నారు. ఒక్కో లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని 2, 3 అసెంబ్లీ సెగ్మెంట్లలో రోడ్డు షోలు నిర్వహించబోతున్నామని వివరించారు.
అనంతరం పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవబోయే సీట్ల సంఖ్య గురించి మాట్లాడుతూ.. ‘‘రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో 8 లోక్‌సభ సీట్లలో బీఆర్ఎస్ పార్టీ గెలుపు జెండా ఎగురవేయబోతోంది. ఇవి కాకుండా మరో 3 స్థానాల్లోనూ విజయం సాధించే అవకాశాలు బలంగా ఉన్నాయి’’ అంటూ ధీమా వ్యక్తం చేశారు.