Radha Spaces ASBL

ఈ పురస్కారం తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవం : కేసీఆర్

ఈ పురస్కారం తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవం : కేసీఆర్

తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు అరుదైన గౌరవం దక్కింది. దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న వరించింది. పీవీకి భారత రత్న ప్రకటించడంపై బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ పురస్కారం తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవంగా పేర్కొన్నారు. పీవీకి భారతరత్న ప్రకటించాలని బీఆర్‌ఎస్‌ పార్టీ చేసిన డిమాండ్‌ను గౌరవించి పురస్కారం ప్రకటించడం పట్ల కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్‌ ధన్యవాదలు తెలిపారు. వీవీ నర్సింహారావుతో పాటు మరో మాజీ ప్రధాని చౌదరి చరణ్‌సింగ్‌, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌కు కూడా కేంద్రం భారత రత్న పురస్కారాన్ని ప్రకటించింది. దీంతో పురస్కార గ్రహీతలకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :