ASBL Koncept Ambience
facebook whatsapp X

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 2 సీట్లు కూడా రావు: కేసీఆర్

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 2 సీట్లు కూడా రావు: కేసీఆర్

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు రెండు సీట్లు కూడా రావని, ఈ మాట సర్వేలే చెబుతున్నాయని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. రాజకీయాల్లో అప్పుడప్పుడు కొంత మంది లిల్లిపుట్‌ గాళ్లకు అధికారం వస్తుందని, పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలిస్తేనే ఆ లిల్లిపుట్‌ గాళ్లకు సురుకు పెట్టినట్లవుతుందని సైటైర్లు పేల్చారు. సంగారెడ్డిలో మంగళవారం నిర్వహించిన మెదక్‌, జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాల ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్ అధికార పార్టీపై విమర్శల వర్షం కురిపించారు.

బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహాన్ని నిర్మించి ఆ మహనీయుడిని గౌరవించుకున్నామని, కానీ విగ్రహం ఏర్పాటైన తర్వాత జరిగిన తొలి జయంతి వేడుకల్లో కాంగ్రెస్‌ ప్రభత్వం విగ్రహం వద్ద ఎలాంటి ఏర్పాట్లూ చేయలేదని, కనీసం పూలమాల పెట్టలేదని, చివరకు సందర్శకులు కూడా వెళ్లకుండా గేట్లు బంద్‌ చేసిందని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఇది కండకావరమా.. అజ్ఞానమా.. మరి సెక్రటేరియట్‌లో ఎందుకు కూర్చుంటున్నారు. దానికి కూడా అంబేద్కర్‌ అని పేరు పెట్టాం కదా? ఎమ్మెల్యే క్వార్టర్లలో ఎందుకు ఉంటున్నారు? యాదాద్రి గుడికి ఎందుకు వెళుతున్నారు? అవన్నీ మా సర్కారే నిర్మించింది కదా? వాటి విషయంలో లేని ఇబ్బంది అంబేద్కర్ విగ్రహం విషయంలో ఎందుకొచ్చింది?’’ అంటూ రేవంత్ సర్కార్‌పై కేసీఆర్ మండిపడ్డారు.

అనంతరం రేవంత్‌ను టార్గెట్ చేస్తూ.. సీఎం రేవంత్ ఇక్కడేమో కాంగ్రెస్‌కు ఓటేయమంటాడని, ఢిల్లీకి వెళ్లి బీజేపీకి ఓటేయమంటాడని కేసీఆర్ ఆరోపించారు. కనీసం ఏడాదైనా ఈ సీఎం ముఖ్యమంత్రిగా ఉంటాడా, లేదా అనేదే ప్రశ్నగా ఉంటే.. ఆయన తీరు చూస్తే అసలు పార్టీలో కొనసాగుతాడా లేక వేరే పార్టీలోకి జంప్ అవుతాడా అనేది అంతకుమించిన చిక్కు ప్రశ్నగా మారిందని కేసీఆర్ సెటైర్లు వేశారు. ‘నారాయణపేట సభలో ముఖ్యమంత్రి వణుకుతున్నాడు. ఆ పార్టీపై ప్రజాగ్రహం ప్రారంభమైంది. లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రెండు సీట్లు కూడా రావని సర్వేలే చెబుతున్నాయి. కాంగ్రెస్‌ పనైపోయింది’’ అంటూ కాంగ్రెస్‌పై కేసీఆర్ ధ్వజమెత్తారు.

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :