లోక్ సభ ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ గులాబీ బస్సు రెడీ..
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో ఆయన రాష్ట్రం మొత్తం బస్సు యాత్ర చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన ముహూర్తం కూడా ఖరారు అయింది. ఏప్రిల్ 22వ తారీఖున మొదలయ్యే ఈ బస్సు యాత్ర మొదటి షెడ్యూల్ మే 10 వ తారీకు వరకు ఉంటుంది. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల ముందుకు జోరుగా తీసుకువెళ్లే ఆలోచనలో గులాబీ బస్సు యాత్ర ప్రారంభం కాబోతోంది. ప్రత్యర్థి కాంగ్రెస్ పదవిలోకి వచ్చిన తర్వాత జరిగిన విషయాల గురించి.. ప్రభుత్వ వైఫల్యం గురించి కూడా కెసిఆర్ జోరుగా ప్రచారం చేయబోతున్నారట. అసెంబ్లీ ఎన్నికలలో ఘోరంగా దెబ్బతిన్న కెసిఆర్ ఈసారి లోక్ సభ ఎన్నికల్లో గెలిచి కొంతైనా పుంజుకోవాలని ప్రయత్నిస్తున్నారు.
Tags :