మాటా కన్వెన్షన్‌లో కార్తీక్ లైవ్ మ్యూజిక్ షో
మన అమెరికా తెలుగు సంఘం (మాటా) ఆధ్వర్యంలో ఏప్రిల్ 13, 14 తేదీల్లో మాటా కన్వెన్షన్ వేడుకలను పెద్దఎత్తున నిర్వహిస్తున్నారు. న్యూజెర్సిలోని రాయల్ అల్బర్ట్ ప్యాలెస్‌లో ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ప్రముఖ నేపథ్యగాయకుడు కార్తీక్ సంగీత కచేరీని గ్రాండ్ ఫైనల్ కార్యక్రమంగా ఏర్పాటు చేశారు. లైవ్ మ్యూజిక్‌లో పలువురు పాటలు పాడనున్నారు. సంగీత దర్శకుడు ఆర్. పి. పట్నాయక్, సమీర భరద్వాజ్, సౌజన్య, సాయి చరణ్, సాహితీ చాగంటి, కౌసల్య, వేణు శ్రీరంగం, రోహిత్, మఖ్దూం సయ్యద్, శృతిరంజని, శ్రీలక్ష్మీ కులకర్ణి, రోబో గణేశన్ తదితరులు తమ పాటలతో, కళలతో అందరినీ ఆకట్టుకోనున్నారు.
దీంతోపాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, మహిళా కార్యక్రమాలు, బిజినెస్ సెమినార్‌లు, యూత్ ఫోరం ఇతర కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. కన్వెన్షన్ విజయవంతానికి ఇప్పటికే పలు కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
ఈ కన్వెన్షన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలకోసం కన్వెన్షన్ వెబ్ సైట్ ను చూడండి.
https://convention.mata-us.org/