ASBL Koncept Ambience
facebook whatsapp X

రెండు భాగాలుగా రానున్న మ‌రో భారీ చిత్రం

రెండు భాగాలుగా రానున్న మ‌రో భారీ చిత్రం

ఇప్పుడేదైనా పెద్ద సినిమా వ‌స్తుందంటే అది ఒక్క సినిమాగా రావ‌డం చాలా క‌ష్ట‌మైపోయింది. ముందు ఒక సినిమాగా మొద‌లై ఆ త‌ర్వాత రెండు భాగాలుగా అనౌన్స్  చేయ‌డం కామ‌నైపోయింది. బాహుబ‌లితో స్టార్ట్ అయిన ఈ ట్రెండ్‌ను ఆ త‌ర్వాత చాలా సినిమాలు ఫాలో అవుతూ వ‌స్తున్నాయి. ఇప్పుడు మ‌రో భారీ సినిమా కూడా ఈ లిస్ట్‌లోకి చేరింది. అది మ‌రేదో కాదు కంగువ‌.సూర్య హీరోగా శివ రూపొందిస్తున్న ఈ సినిమాకు ఇప్ప‌టికే మంచి బ‌జ్ ఏర్ప‌డింది. కంగువ ద‌స‌ర కానుక‌గా అక్టోబ‌ర్ 10న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ ఉన్న‌ట్లు నిర్మాత జ్ఞాన‌వేల్ రాజా అధికారికంగా అనౌన్స్ చేశాడు. అయితే కంగువ‌2 మొద‌ల‌వ‌డానికి కాస్త ఎక్కువ టైమే ప‌డుతుంద‌ట‌.

వ‌చ్చే ఏడాది చివ‌ర్లో కానీ, 2026 స్టార్టింగ్ లో కానీ మొద‌లై మ‌రో ఏడాది త‌ర్వాత ఆడియ‌న్స్ ముందుకు రానుందట‌. ఇప్ప‌టికే కంగువ నుంచి రిలీజైన కంటెంట్ ఆడియ‌న్స్ లో భారీ అంచ‌నాల‌ను రేకెత్తించింది. కంగువలో మైండ్ బ్లోయింగ్ విజువ‌ల్స్ ఉంటాయ‌ని, కోలీవుడ్ లో ఇప్ప‌టివ‌ర‌కు చూడ‌ని విజువ‌ల్స్ కంగువ‌లో ఉంటాయ‌ని త‌మిళ మీడియా వ‌ర్గాలు ఊరిస్తున్నాయి. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ జ‌రుపుకుంటుంది. త్వ‌ర‌లోనే సెకండ్ టీజ‌ర్ ను రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.  

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :