ప్రాజెక్ట్ కె లో కమల్?

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరో రెండు వారాల్లో ఆదిపురుష్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న ప్రభాస్, ఆ తర్వాత మూడు నెలలకు సలార్, అది రిలీజైన నాలుగు నెలలకు ప్రాజెక్ట్ కె ను రిలీజ్ చేసే విధంగా తన సినిమాలను ప్లాన్ చేసుకున్నాడు. ఇదిలా ఉంటే ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కె లో కమల్ హాసన్ నటించొచ్చనే వార్త ఒక్కసారిగా మీడియాను షేక్ చేసింది.
దీని గురించి ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ లేకపోయినా, ప్రాజెక్ట్ కె లో ఓ కీలక పాత్ర కోసం నాగ్ అశ్విన్ కమల్ హాసనన్ ను అప్రోచ్ అయి, డీటెయిల్డ్ నెరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు కమల్ హాసన్ ను కేవలం 20 రోజుల డేట్స్ మాత్రమే నాగ్ అశ్విన్ అడిగాడని, ఆ టైమ్ లోనే ఆయన పాత్రకు సంబంధించిన షూట్ ని పూర్తి చేస్తానని చెప్పాడట.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇండియన్2 షూటింగ్ లో బిజీగా ఉన్న కమల్ హాసన్ తనకున్న కమిట్మెంట్స్ పూర్తి కావాలంటే సెప్టెంబర్ వరకు టైమ్ పడుతుందట. మరి తర్వాత ప్రాజెక్ట్ కె లో ఏమైనా కమల్ చేస్తాడా అనేది చూడాలి. ఒక వేళ కమల్ హాసన్ కూడా ఈ సినిమాలో నటిస్తే మాత్రం ఈ సినిమా హైప్ మరింత పెరగడం ఖాయం.
ఇప్పటికే ప్రాజెక్ట్ కె భారీ క్యాస్టింగ్ తో తెరకెక్కుతుండగా, కమల్ కూడా ఈ సినిమాలో జాయిన్ అయితే ఈ సినిమాకు తమిళ నాట క్రేజ్ డబుల్ అవడం ఖాయం. ఈ సినిమాను సంక్రాంతి, 2024 కి రిలీజ్ చేయాలని వైజయంతి మూవీస్ బ్యానర్ ఇప్పటికే డెడ్ లైన్ గా పెట్టుకుని అనౌన్స్ చేసింది కూడా. టైం ట్రావెల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ చాలా కొత్తగా ఉండనుందట.






