ASBL Koncept Ambience
facebook whatsapp X

బాహుబ‌లి2 రికార్డుల‌కు ద‌గ్గ‌ర‌గా క‌ల్కి

బాహుబ‌లి2 రికార్డుల‌కు ద‌గ్గ‌ర‌గా క‌ల్కి

ఎప్పుడో ఏడేళ్ల కిందట రిలీజైన బాహుబ‌లి ది కంక్లూజ‌న్ సినిమా సృష్టించిన సంచ‌ల‌నం అంతా ఇంతా కాదు. ఇండియ‌న్ సినిమాలో అలాంటి బాక్సాఫీస్ సంచ‌ల‌నాన్ని ఇంత‌కుముందెప్పుడూ చూడ‌లేదు. ముందే కాదు త‌ర్వాత కూడా అలాంటి యుఫోరియాను మ‌రే సినిమా రిపీట్ చేయ‌లేక‌పోయింది. ఆ సినిమా సృష్టించిన రికార్డులు కొన్ని ఇంకా అలానే ఉన్నాయి. అందులో యూఎస్ లో 20 మిలియ‌న్ డాల‌ర్ల రికార్డు కూడా ఒక‌టి. ఈ రికార్డ్ ను తెలుగు సినిమాలే కాదు, హిందీ సినిమాలు కూడా ట‌చ్ చేయ‌లేక‌పోయాయి. రాజ‌మౌళి త‌ర్వాతి సినిమా ఆర్ఆర్ఆర్ కూడా ఆ రికార్డును బ్రేక్ చేయ‌లేక‌పోయింది. 20 మిలియ‌న్స్ కాదు క‌నీసం 15 మిలియ‌న్ డాల‌ర్ల మార్క్ ను కూడా ఇప్ప‌టివ‌ర‌కు ఏ సినిమా ట‌చ్ చేయ‌లేదు.

కానీ క‌ల్కి సినిమా ఇప్పుడు యూఎస్‌లో క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తోంది. డివైడ్ టాక్ వ‌చ్చిన‌ప్ప‌టికీ ఈ సినిమాకు యూఎస్ ఆడియ‌న్స్ బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. మొద‌టి రోజు 5.6 మిలియ‌న్ డాల‌ర్లు క‌లెక్ట్ చేసిన క‌ల్కి ఇప్పుడు ఏకంగా 15 మిలియ‌న్ డాల‌ర్ల క్ల‌బ్ లోకి అడుగు పెట్టింది. సెకండ్ వీకెండ్ లో కూడా క‌ల్కి మంచి క‌లెక్ష‌న్స్ రాబ‌డుతుంది. చూస్తుంటే క‌ల్కి బాహుబ‌లి2 రికార్డుల‌కు ద‌గ్గ‌ర‌గా వెళ్లే ఛాన్సులు బాగానే క‌నిపిస్తున్నాయి.  

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :