కల్కి.. అన్నీ జూన్ 4 తర్వాతే!
మరో నెల రోజుల్లో రిలీజ్ కాబోతున్న కల్కి 2898ఏడీ కి సంబంధించిన ప్రమోషన్స్ జోరు మెల్లిగా పెరుగుతుంది. ఈ కథలో కీలకంగా నిలిచే బుజ్జి అనే కారుతో బాగానే హడావిడి చేస్తుంది చిత్ర యూనిట్. కీర్తి సురేష్ తో ఆ పాత్రకు డబ్బింగ్ చెప్పించడం, తర్వాత నాగచైతన్య లాంటి సెలిబ్రిటీ రైడర్ తో ఆ కారును డ్రైవింగ్ చేయించడం.. ఇదంతా సోషల్ మీడియాలో బాగానే వర్కవుట్ అయింది.
అయితే ఫ్యాన్స్ మాత్రం ఎంతసేపు బుజ్జి గురించేనా? వి వాంట్ మోర్ అంటూ కల్కి టీమ్ ను అడుగుతున్నారు. అయితే కల్కికి సంబంధించిన అసలు ప్రమోషన్స్ ను మేకర్స్ జూన్ 4న ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాకే స్టార్ట్ చేయనున్నారట. అప్పటివరకు ఈ సినిమా విషయంలో లో ప్రొఫైల్ మెయిన్‌టెయిన్ చేయాలని చిత్ర బృందం డిసైడైంది.
ఇప్పటివరకు సినిమా నుంచి దీపికా, దిశా పటానీ ని ఇంట్రడ్యూస్ చేయలేదు. అమితాబ్ పాత్రను మాత్రమే రివీల్ చేశారు. జూన్ 4 తర్వాత నుంచి సినిమాలోని ఒక్కో క్యారెక్టర్ ను ఇంట్రో రూపంలో రిలీజ్ చేయనున్నారట. రిలీజ్ కు ఎక్కువ టైమ్ లేదు కాబట్టి ఉన్న టైమ్ లోనే అన్నీ పనులు అయ్యేలా ప్రమోషన్స్ ను పరుగులు పెట్టించనున్నారట. అంతేకాదు నాని, దుల్కర్ క్యామియోలను కూడా రివీల్ చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నారట మేకర్స్. జూన్ మొదటివారంలో కల్కికి సంబంధించిన ఆడియో లాంచ్ జరగనున్నట్లు తెలుస్తోంది.