ASBL NSL Infratech

రామోజీరావు మృతి తెలుగుజాతికి తీరని లోటు - కాకతీయ సేవాసమితి, డల్లాస్ అమెరికా

రామోజీరావు మృతి తెలుగుజాతికి తీరని లోటు - కాకతీయ సేవాసమితి, డల్లాస్ అమెరికా

తెలుగుజాతి కీర్తిని విరజిమ్మిన ఆదర్శ మూర్తి,  స్ఫూర్తిప్రదాత, దార్శినికుడు , సమాజసేవకుడు, నిత్యకృషీవలుడు రామోజీరావు అని కాకతీయ సేవాసమితి డల్లాస్ అమెరికా వారు కొనియాడారు. రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు గారి సంస్మరణ సభను డల్లాస్ నగరం లోని ఫ్రిస్కోలో కాకతీయ సేవాసమితి ఆధ్వర్యములో నిర్వహించారు.

ఈసందర్భం గా పలువురు ఎన్నారైలు మాట్లాడుతూ రామోజీరావుగారు సామాన్య రైతు కుటుంబంలో జన్మించి పట్టుదలతో ఈనాడు, ఈటీవీ, మార్గదర్శి, రామోజీ ఫిలింసిటీ లాంటి ఎన్నో సంస్థలను స్థాపించి ఎందరికో ఉపాదికలించి సమాజసేవ చేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు.

అలాంటి వ్యక్తి  మరణం తెలుగు ప్రజలకు తీర్చలేని లోటని పలువురు ఎన్నారైలు అన్నారు. ఆయన మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు, రామోజీ గ్రూపు సంస్థలలో పనిచేసేవారికి ఎన్నారైలు ప్రగాఢ సానుభూతిని తెలియచేసారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :