సౌత్ ఇండస్ట్రీ అంటే గౌరవమంటున్న కాజల్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సినిమాలతో బిజీ అయింది. పెళ్లి, ఆ తర్వాత కొడుకు పుట్టడంతో సినిమాల నుంచి చిన్న బ్రేక్ తీసుకున్న కాజల్, ప్రస్తుతం బాలకృష్ణతో ఓ సినిమాను, కమల్‌హాసన్‌తో మరో సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే సౌత్‌లో మరో పెద్ద స్టార్ హీరో సరసన కాజల్ నటించబోతున్నట్లుగా తెలుస్తోంది.
ఇలాంటి సమయంలో కాజల్ సౌత్ ఇండస్ట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రైజింగ్ ఇండియా సమిట్ లో కాజల్ మాట్లాడుతూ, సినిమాకు భాష ఏదీ లేదని, ఏ భాషలో అయినా సినిమా లవర్స్ ను ఎంటర్టైన్ చేయాలని కోరకుంటానని పేర్కొంది. తాను పుట్టి పెరిగింది ముంబైలోనైనా ఎక్కువ సినిమాలు చేసింది మాత్రం సౌత్‌లోనే అని చెప్పింది.
తెలుగు, తమిళ సినిమాలు ఎక్కువగా చేయడం వల్ల తనకు హైదరాబాద్, చెన్నై అంటే ప్రత్యేకమైన అభిమానమని కాజల్ చెప్పుకొచ్చింది. సౌత్ సినిమాల్లో స్నేహ పూర్వక వాతావరణం ఎక్కువ ఉండటంతో పాటుగా, హీరోయిన్ క్యారెక్టర్లకు ఎక్కువగా ఎక్స్పోజర్ లభిస్తుందని, హిందీ సినిమాల్లో, బాలీవుడ్ ఇండస్ట్రీలో నీతి, విలువలు తక్కువ అని కాజల్ అభిప్రాయ పడింది.
సౌత్ సినిమాల్లో హీరోయిన్స్ కు ఇచ్చే ప్రాముఖ్యత ఎక్కువ మరియు తనకు కాస్త ఎక్కువ గౌరవం కాబట్టి తాను సౌత్ ఇండస్ట్రీలోనే కొనసాగాలని కోరుకుంటున్నట్లు, హిందీ సినిమాలన్నీ కూడా తనకు గౌరవమని కాజల్ పేర్కొంది. ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో పాటూ కాజల్ మరికొన్ని సినిమాల్లో కూడా నటించబోతున్నట్లుగా వెల్లడించింది.